సల్మాన్, షారుఖ్ ల సినిమాలు కూడా సక్సెస్ కావట్లేదు, మారాలి-తాప్సీ

First Published Aug 18, 2017, 2:19 AM IST
Highlights
  • తాప్సీ ఆనందో బ్రహ్మ ఈ శుక్రవారమే రిలీజ్
  • ఈ సందర్భంగా బాలీవుడ్ సినిమాల స్టైల్ మారాలన్న తాప్సీ
  • షారుఖ్,  సల్మాన్ సినిమమాలు కూడా ఆ డట్లేదన్న తాప్సీ

సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పన్ను నటిస్తున్న తాజా చిత్రం ఆనందో బ్రహ్మ విడుదల సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు పలు ఆసక్తికర అంశాలపై మీడియాతో మాట్లాడింది. బాలీవుడ్ సినిమాలు చేశాక తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందంటోంది.

 

ఇక బాలీవుడ్ లో నటించిన పింక్ సినిమా తర్వాత.. నాపై నమ్మకం పెరిగింది. మీడియా నా గురించి రాయాలనుకోవడం, నేనేం చేస్తున్నా వెంటపడటం నాపై కొత్త అటెన్షన్ తీసుకొచ్చింది. ప్రతీ సినిమా నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. నేను జనం కోరుకున్న సినిమాలు చేశాను, మొదట్లో కమర్షియల్ సినిమాలు చేసినా... మూడేళ్ల తర్వాత నాకు నచ్చిన సినిమాలు చేసే అవకాశం దక్కింది. మనం ఎన్ని సినిమాలు చేస్తున్నాం. ఎంత పెద్ద సినిమాలు, ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం. అనే విషయాలు పక్కనబెట్టి.. నచ్చినట్లు చేస్తూ.. గత మూడేళ్లుగా జీవితంలో చాలా సంతోషంగా వున్నానంది తాప్సీ.

 

ఇక తన సినిమాల సక్సెస్ రేటుపై ప్రశ్నించగా సినిమా సక్సెస్ ను అంచనా వేయడంలో చాలా మంది విఫలమవుతున్నారంది. ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నేను నటించిన నామ్ షబానా అత్యధిక కలెక్షన్స్ సాధించింది. అసలు బాలీవుడ్ కన్నా ఎక్కువ బిజినెస్ టాలీవుడ్ లో అవుతుంది. బాలీవుడ్ ఏం టాలీవుడ్ కన్నా పెద్దది కాదు. చాలా బాలీవుడ్ సినిమాలను టీవీలో వచ్చినపప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు తప్ప జనం ఒకే రకమైన సినిమాలు చూడాలనుకోవట్లేదు. ఇటీవల విడుదలైన షారుఖ్, సల్మాన్ ల సినిమాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేదు. అన్నీ వేర్వేరు జోనర్ల సినిమాలే కానీ... ఎందుకో వర్కవుట్ కావట్లేదు. మరి ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి అంటోంది తాప్సీ.

click me!