ఆలోచించకుండా మాట్లాడి రోడ్డున పడ్డారు.. 'మా' వివాదంపై తమ్మారెడ్డి!

By Udayavani DhuliFirst Published Sep 5, 2018, 6:08 PM IST
Highlights

మూవీ ఆర్టిస్ అసోసియేషన్(మా) నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నిధుల దుర్వినియోగంపై అధ్యక్షుడు శివాజీరాజా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

మూవీ ఆర్టిస్ అసోసియేషన్(మా) నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నిధుల దుర్వినియోగంపై అధ్యక్షుడు శివాజీరాజా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి మొత్తం రివిజన్ చేయాలని ప్రధాన కార్యదర్శి నరేష్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

''శివాజీరాజా, నరేష్ ఇద్దరూ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఇద్దరూ నిస్వార్ధపరులు. కానీ వీరిద్దరూ ఇవాళ రోడ్డున పడటం బాధగా, కోపంగా ఉంది. ఇద్దరూ ఇండస్ట్రీకి కావాల్సిన వ్యక్తులు. 'మా' అసోసియేషన్ కోసం ఫండ్ రైజింగ్ చేద్దామనుకున్నారు. దానికోసం కమిటీలు వేశారు. ఆ ఫంక్షన్ కి ఓ కంపెనీ వాళ్లు కోటి రూపాయలను ఇచ్చారు. కార్యక్రమానికి చిరంజీవి గారిని రమ్మని అడిగితే ఆయన అమెరికా వెళ్లారు.

అందరూ కలిసి అమెరికా వెళ్లొచ్చారు. సంతకాలు పెట్టి అన్నీ అయిపోయిన తరువాత డబ్బులు తినేశారని ఆరోపణలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. శివాజీ రాజా, నరేష్ లు ఆలోచించకుండా మాట్లాడి రోడ్డున పడ్డారు. ప్రెస్ మీట్స్ పెట్టుకుంటూ ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటున్నారు. నవ్వాలో, ఏడవాలో, కొట్టాలో, కోప్పడాలో, తిట్టాలో అర్ధం కాని పరిస్థితి. మాలగా ఖాళీగా ఉన్నవాళ్లకి మాట్లాడడానికో అవకాశం ఇవ్వడం తప్ప దీనివల్ల వచ్చేదేమీ లేదు. ఇలాంటి సమస్యల కోసం ఇండస్ట్రీలో ఓ కమిటీకూడా వేసుకున్నాం. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే విషయాలను పెద్ద ఇష్యూ చేసి ఇండస్ట్రీని చులకన చేస్తున్నారు'' అంటూ వెల్లడించారు. 

click me!