దేశమంతా ఆస్కార్ దక్కిన సంబురంలో ఉంటే.. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు చెందిన కొందరు ఫ్యాన్స్ మధ్య వింత వార్ జరుగుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ సినిమా చరిత్రలోనే చెరగని ముద్ర వేసింది. కలలోనూ సాధించలేమని భావించిన అత్యంత ప్రతిష్టాత్మక ‘ఆస్కార్ అవార్డు’ను సొంతం చేసి చూపించారు. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసేలా చేశారు. ఈరోజు అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లో జరిగిన 95వ ఆస్కార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో Naatu Naatu కు ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల భారతీయులు గర్విస్తున్నారు. ఇండియా గెలిచిన ఆనందంలో ‘ఆర్ఆర్ఆర్’పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పీఎం, సీఎంలు, ప్రజాప్రతినిధులు, సినీ తారలు, అభిమానులు అభినందనందిస్తున్నారు. ఆస్కార్ అందడంతో పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దేశమంతా ఆస్కార్ సంబురంలో ఉంటే.. మరోవైపు ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫ్యాన్స్ కు సంబంధించిన కొందరు సోషల్ మీడియాలో వింత వార్ కొనసాగిస్తున్నారు. పోస్టులు, ప్రతిపోస్టులు చేస్తున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ నిమా ప్రారంభం నుంచే ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య పోరు ప్రారంభమైంది. మా హీరోనే గొప్పంటే.. మా హీరోనే గొప్పనే సందర్భాలు చాలా సార్లు కనిపించాయి. అయితే తాజాగా ఆస్కార్ అవార్డు విషయంలో తగువులాడుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘నాటు నాటుకు ఆస్కార్ దక్కడం ఎన్టీఆర్ ఘనతే’ అనేలా ఓ పోస్ట్ ను వదిలారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై చరణ్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. కామెంట్లతో కౌంటర్లు ఇస్తున్నారు. ట్వీట్లతో తమ అభిమాన హీరోకు మద్దతు ఇస్తున్నారు.
ఓవైపు అందరూ ఆకామెంట్లతో కౌంటర్లు ఇస్తున్నారు. ట్వీట్లతో తమ అభిమాన హీరోకు మద్దతు ఇస్తున్నారు. స్కార్ సంతోషంలో ఉంటే.. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఇలా పోస్టులు చేయడం ఎందుకంటూ కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతటి పురస్కారాన్ని అందుకున్న వీళ్లు మారేలా లేరేంటున్నారు. పాన్ ఇండియా స్టార్స్ గా ఎదుగుతున్న హీరోలకు అభిమానులై ఇలా పోస్టు పెట్డడం ఏమాత్రం బాగోలేదని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కడంతో భారతీయులు, సినీ ప్రియులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రతిస్టాత్మక వేదికపై తెలుగోడికి దక్కిన గౌరవానికి పొంగిపోతున్నారు. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ఎలిఫెంట్ విస్పరర్స్’కు అవార్డు దక్కింది. 95వ ఆస్కార్స్ ప్రదానోత్సవంలో ఇండియాకు రెండు అవార్డులు దక్కడం విశేషం.
Let's Celebrate our Victory 🐯 pic.twitter.com/AA2xD9O6DU
— NTR Trends (@NTRFanTrends)