అబ్బాస్ తో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం తమిళ స్టార్ హీరో అని తెలుసా..?

By Mahesh Jujjuri  |  First Published Nov 30, 2023, 5:53 PM IST

ఈ కింద కనిపిస్తున్నఫోటో చూశారా.. అందులో ఎవరు ఉన్నారు అంటే వెంటనే అబ్బాస్ అని చెప్పేస్తారు. కాని అబ్బాస్ చేయి వేసి కూర్చున్నది కూడా ఓ హీరో పైనే అని మీకు తెలుసా..? ఓ యంగ్ హీరో చిన్ననాటి ఫోటో ఇది. ఇంతకీ ఆ యంగ్ స్టార్ తమిళ్ హీరో ఎవరో తెలుసా..? 
 



కొన్ని కొన్ని విషయాలు కన్ ఫ్యూజన్ లో పడేస్తుంటాయి. కొన్ని ఫోటోలు వైరల్అవుతాయి ఎందుకో కూడా తెలియకుండానే. అలాంటి ఫోటోనే ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఫోటోలు ఇద్దరు హీరోలు ఉన్నారు. అందులో అబ్బాస్ అందరికి తెలిసిన వారే.. కాని పక్కన చెయి వేసి ఉన్న హీరో ఎవరా అని అంతా ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు.. ఎవరబ్బా...ఈ హీరో అని క్లూ కూడా ఇమ్మంటున్నారు. అయితే ఈ యంగ్ స్టార్ హీరో ప్రస్తుతం తమిళ పరిశ్రమను ఏలుతున్న హీరోలలో ఒక హీరో అయిన విజయ్ మేనల్లుడు. ప్రస్తుతం తమిళనాట వరుస  సినిమాలు చేస్తున్న హీరో. ఈ క్లూతోచాలా మంది ఈ హీరో ఎవరో తెలుసుకోవచ్చు. 

ఇంతకీ ఆహీరో ఎవరో కాదు జై.  జర్నీ, రాజా రాణి లాంటి సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పేరు సాధిచాడు జై. తమిళనాట కాస్త వివాదాలు జరిగాన.. జై కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జై చిన్నప్పటి ఫోటో ఇది.  అయితే ఇందులో హీరో అబ్బస్ కూడా కనిపించడం.. జై మీద చేయి వేసుకుని ఉండటంతో.. వీరి మధ్య మంచి అనుబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పోటో ఎప్పటిది.. ఏ సందర్భంలో తీశారు అనేదిమాత్రం తెలియడం లేదు. కాని ఏదో సినిమా పంక్షన్ లో నే ఈ ఫోటో తీసినట్టు మాత్రం బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తోంది. \

Latest Videos

ఇక  అబ్బాస్ విషియానికి వస్తే.. అమ్మాయిల కలల రాకుమారుడిగా.. రాజకుమారుడిలా తమిళ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు అబ్బాస్. ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన అబ్బాస్.. ఆతరువాత ఛాన్స్ లు లేక న్యూజిలాండ్ వెళ్ళిపోయారు. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ..మెకానిక్ గా కూడా జీవితం సాగించారు. ఆతరువాత కొంత కాలం ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు అబ్బాస్. తాజాగా ఆయన చెన్నై షిప్ట్ అయినట్టుతెలుస్తోంది. అబ్బస్ నటించిన ప్రేమ దేశం సినిమా.యువతను ఉర్రూతలూగించింది. 

ప్రేమదేశం సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం అయ్యారు అబ్బాస్. ఈసినిమాతో అబ్బాస్  కు అప్పట్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ రోజుల్లో ఒక్క మూవీ తో స్టార్ అయిపోవడం చాలా కష్టం కానీ అబ్బాస్ కి మాత్రం విపరీతమైన క్రేజ్ బాగా వచ్చింది అయితే ఆయన ఫస్ట్ మూవీ లో బెస్ట్ అయినా తర్వాత మాత్రం అనుకున్న విజయాలని సొంతం చేసుకోలేకపోయారు. అబ్బాస్ ప్రతినాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాలో నటించారు.

click me!