ఓటు వేయని వారిని ఏమంటారు..? మీడియాకి బ్రహ్మానందం పిచ్చెక్కించే ఆన్సర్‌..

By Aithagoni RajuFirst Published Nov 30, 2023, 5:29 PM IST
Highlights

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెలబ్రిటీలు భారీగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణ జనంతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో భారీగా పోలింగ్‌ జరుగుతుంది. జనం కూడా ఓట్ వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఓటర్లని ప్రభావితం చేయడంలో సినిమా సెలబ్రిటీలది పై చేయి. వారు చెబితే జనాలకు బాగా రీచ్‌ అవుతుంది. ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. 

ఈ రోజు ఓటింగ్‌లో చాలా వరకు స్టార్లు ఓటింగ్‌ని వినియోగించుకున్నారు. తమ పరిధిలోని పోలింగ్‌ బూతుల్లో ఓట్లు వేశారు. వారికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫోటోలతోపాటు వారి వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా కొందరు ఓట్‌ వేయాలని ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్‌, విజయ్‌ దేవరకొండ, రామ్‌, ఇలా కొంత మంది సినీ తారలు ఓటింగ్‌ ప్రాధాన్యతని తెలియజేస్తున్నారు. 

Latest Videos

ఇదిలా ఉంటే బ్రహ్మానందం సైతం మీడియాతో ముచ్చటించారు. ఓటు వేయడానికి వచ్చిన ఆయన్ని చూసిన మీడియా ఎగబడింది. అభిప్రాయం చెప్పాలని తెలిపింది. ఈ సందర్భంగా ఆయనకు ఓ ప్రశ్న మీడియా వారి నుంచి ఎదురయ్యింది. ఓటు హక్కు ఉండీ ఉపయోగించుకోని వాళ్లని ఏమంటారని మీడియా ప్రతినిధి అడగ్గా.. బ్రహ్మానందం తనదైన స్టయిల్‌లో కామెడీ పంచ్ వదిలారు. అదిరిపోయే సమాధానం ఇచ్చారు. రిపోర్టర్‌కి ఏమాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా `ఏమంటామండి.. ఓటు హక్కు వినియోగించుకోనివారు` అంటాం అంటూ ఫన్నీగా ఆయన సమాధానం చెప్పారు. 

ఇదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బ్రహ్మీ అంతటి సీరియస్‌ పరిస్థితులోనూ తనదైన పంచ్‌లు వదిలి నవ్వులు పూయించారు. దీంతో బ్రహ్మీ అంటే నవ్వులే అని, అందుకే ఆయన్ని హాస్యబ్రహ్మ అంటారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ వీడియో క్లిప్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక బ్రహ్మానందం ఇటీవల సినిమాలు తగ్గించారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు తక్కువగా వెళ్తున్నాయి. అందుకే చాలా సెలక్టీవ్‌గా చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన `రంగమార్తాండ` చిత్రంలో సీరియస్‌ పాత్రలో కనిపించి అందరి చేత కన్నీళ్లు పెట్టించారు. సినిమా క్రెడిట్‌ మొత్తం తను తీసుకెళ్లిపోయారు. 
 

click me!