
కరోనా ఎఫెక్ట్ తో క్రియేట్ అయిన పరిస్థితుల కారణంగా బాక్స్ ఆఫీస్ భారీ యుద్దం తప్పేలా కన్పించటం లేదు. కాని పోటి అనేది సమ ఉజ్జీల మధ్య, ఒకే రకమైన సినిమాల మధ్య ఉంటుంది. కాకపోతే మీడియాకు మసాలా కాబట్టి వార్తలు వండి వార్చేస్తుంది. నిన్నటి నుంచి మరో భారీ క్లాష్ కు సౌత్ ఇండస్ట్రీ రెడీ కాబోతోందా ? అనే హెడ్డింగ్ తో వార్తలు హోరెత్తిపోతున్నాయి.
ఇంతకీ ఆ భారీ క్లాష్ ఏమిటి అంటే....‘రాధేశ్యామ్’రిలీజ్ డేట్ ఇచ్చేసారు కదా. ఆ సినిమాకు గట్టి పోటీ నెలకొందని అంటున్నారు.
సూర్య నటిస్తున్న “ఈటీ” అనే సినిమాను “రాధేశ్యామ్” కంటే ఒక్క రోజు ముందు తమిళం లో విడుదల చేయబోతున్నారు. మార్చి 10న థియేటర్లలోకి వస్తున్న సూర్య సినిమా, కచ్చితంగా రాధేశ్యామ్ కు పోటీనిస్తుందనడంలో అంటున్నారు. అయితే ప్రభాస్ మార్కెట్ వేరు..ఆడియన్స్ వేరు..సూర్య మార్కెట్ వేరు...అలాంటప్పుడు సూర్య సినిమా వచ్చి ప్రభాస్ సినిమాకు పోటీ ఇస్తుందనటం హాస్యాస్పదమే.
వాళ్ల లాజిక్ ఏమిటంటే...సూర్య సినిమా థియేటర్లలోకొచ్చి చాలా రోజులైంది. “ఆకాశం నీ హద్దురా”, “జై భీమ్” లాంటి సినిమాలన్నీ డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేశాయి. దీంతో సూర్య సినిమాను థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అని. అయితే సూర్య సినిమాకు తమిళంలో మార్కెట్ ఉంటుంది. ఇక్కడ హిట్టయితేనే చూస్తారు.
సేమ్ టు సేమ్ ప్రభాస్ సినిమాకు కూడా. తెలుగులో ఉన్న మార్కెట్టే ప్రభాస్ కు కలిసి వచ్చే అంశం. ఆ తర్వాత నార్త్ ఇండియా మార్కెట్. కాబట్టి ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజైనా థియోటర్స్ సమస్య తప్పించి ఏ సమస్యా రాదు. ఆ థియోటర్స్ సమస్య కూడా సూర్యకు తెలుగులో డబ్బింగ్ మార్కెట్ కాబట్టి ఇంపాక్ట్ చూపించదు. తమిళంలో ప్రభాస్ కు డబ్బింగ్ మార్కెట్టే..ఎవరి జోరు వారిదే. ఎవరి సినిమా బాగుంటే అదే ఆడుతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం ఈటి( “ఎతర్క్కుం తునింధవన్”)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ యాక్షన్ డ్రామా మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.