పునిత్ రాజ్ కుమార్ కు విజయ్ నివాళి... ఇన్నాళ్లకు తీరిందా దళపతి అంటూ ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..

Published : Feb 28, 2022, 07:42 AM IST
పునిత్ రాజ్ కుమార్ కు విజయ్ నివాళి... ఇన్నాళ్లకు తీరిందా దళపతి అంటూ ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..

సారాంశం

కన్నడ స్టార్ హీరో పునిత్ రాజ్ కుమార్ కు సెలబ్రిటీలు వరుసగా నివాళి అర్పిస్తూనే ఉన్నారు. ఆయన చివరి చూపుకు రాలేక పోయిన స్టార్స్.. ఇప్పుడు ఆయన సమాధి సందర్శనకు వస్తున్నారు. రీసెంట్ గా దళపతి విజయ్ పునిత్ సమాధిని సందర్శించారు.

కన్నడ స్టార్ హీరో పునిత్ రాజ్ కుమార్ కు సెలబ్రిటీలు వరుసగా నివాళి అర్పిస్తూనే ఉన్నారు. ఆయన చివరి చూపుకు రాలేక పోయిన స్టార్స్.. ఇప్పుడు ఆయన సమాధి సందర్శనకు వస్తున్నారు. రీసెంట్ గా దళపతి విజయ్ పునిత్ సమాధిని సందర్శించారు.

లాస్ట్ ఇయర్  అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. 46ఏళ్ల చిన్న వయస్సులో ఆయన మరణం అటు ఫ్యాన్స్ తో పాటు అందరిని షాక్ కు గురి చేసింది. పునిత్ ఫ్యామిలీత పాటు.. ఆయన ఫ్యాన్స్.. ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు యావత్ తరలి వచ్చి కన్నీరు పెట్టారు. ముఖ్యంగా కన్నడ అభిమానులు తమ పవర్ స్టార్ అకాల మరణాన్ని తట్టుకోలేక పోయారు. రకరకాలుగా ఆయన మీద ఉన్న అబిమానాన్ని చాటుకున్నారు. చాలా రోజుల వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ పునీత్‌ సమాధిని అభిమానులు సందర్శిస్తూ..బాధపడుతూనే ఉన్నారు.

పునీత్ మృతి చెందిన సమయంలో యావత్ భారత సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో చివరి చూపు కోసం అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కూడా బెంగళూరు వచ్చి పునిత్ కు నివాళ అర్పిచారు. కాని తమిళ స్టార్స్ మాత్రం ఎవరూ పునిత్ ను చూటానికి రాలేదు. అది అప్పట్లోనే పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

ఆతరువాత విశాల్ లాంటి స్టార్స్ చిన్నగా పునిత్ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చారు. కాని పెద్ద్ద పెద్ద స్టార్స్ ఎవరూ రాలేదు. అయితే రీసెంట్ గా తమిల స్టార్ హీరో దళపతి విజయ్ పునిత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించారు. కంఠీరవ స్టూడియోలో ఉన్న పునిత్ సమాదిని దర్శించుకున్న విజయ్ నివాళి అర్పించారు. ఈ విషయంలో సోషల్ మీడియాలోకెక్కకడంతో..విజయ్ ను నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

పునీత్ చనిపోయిన ఇన్నాళ్లకు విజయ్‌కి ఇప్పుడు టైమ్  దొరికిందా..? అంటూ కన్నడ మీడియా వర్గాలతో పాటు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయి ఇంతకాలం గడుస్తున్నా ఇప్పటి దాకా తనకు తీరిక దొరక లేదా అంటూ విమర్శిస్తున్నారు. విజయ్ నిజంగానే అంత బిజీగా ఉన్నాడా ఇప్పటికి కానీ ఆయనకు కుదర్లేదా అంటూ నెటిజన్లు దులిపేస్తున్నారు.

అంతే కాదు ఇప్పుడు కూడా విజయ్ కావాలని రాలేదని. ఏదో పనిమీద బెంగళూరు వచ్చి.. పనిలో పనిగా పునిత్ సమాధిని సందర్శించేందుకు వచ్చాడంటూ.. సోషల్ మీడియా జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు.దీనికి కౌంటర్‌గా విజయ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై సోషల్ మీడియాలో వస్తున్నట్రోల్స్ కు కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు