
సెలబ్రిటీస్ కు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ తప్పనిసరి అయ్యింది. ఏవిషయం అయినా సరే సోషల్ మీడియాలోనే తేల్చుకుంటన్నారు స్టార్లు. ఏ అప్ డేట్ అయినా.. సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.ఇక ఇప్పుడు మెగాస్టార్ సతీమణి కూడా ఇందులో భాగమయ్యారు.
సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించేది ఫిల్మ్ సెలబ్రిటీలే.. ఆతరువాత పొలిటీషయన్లు..మిగతావారు. టాలీవుడ్ సెలెబ్రిటీలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి వాటిలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వేదికగా రకరకాల పోస్టులతో సందడి చేస్తుంటారు. ఇక రీసెంట్ గా చాలా మంది స్టార్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ను ఓపెన్ చేస్తున్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవల్సిన స్టార్ చిరంజీవి.
అందరు స్టార్లు ఎప్పటి నుంచో సోషల్ మీడియా అకౌంట్లు కలిగి ఉంటే..మెగాస్టార్ మాత్రం రీసెంట్ ఇయర్స్ లోనే జాయిన్ అయ్యారు. కాని అంతమంది.. అన్ని ఏళ్ళుగా సాధించలేని ఫాలోవర్స్ ను మెగాస్టార్ చాలా తక్కువ టైమ్ లో సాధించారు. ఒక్క ట్విట్టర్‌లోనే చిరుకు 1.2 మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఇక చిరు తనయుడు రామ్ చరణ్‌కు 2 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఇక చిరు మేనల్లుడు అల్లు అర్జున్‌కు ఏకంగా 6.5 మిలియన్ల ఫాలోవర్లున్నారు.
ఇక రీసెంట్ గా మెగాస్టార్ సతీమణి సురేఖ కొణిదెల ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓ పోస్ట్ కూడా పెట్టారు. ఫస్ట్ పోస్ట్ లో తన గారాల తనయుడు రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారామె. నా సూపర్ స్టైలీష్ కొడుకుతో నా ఫస్ట్ పోస్ట్‌తో ట్విట్టర్లో చేరినందుకు సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చారు సురేఖ. ప్రస్తుతం సురేఖ కొణిదెల మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఖాతాలను ఫాలో అవుతున్నారు.
Please Subscribe My Officii Twitter Account Here's Link : https://t.co/lQmlfTPEqL
సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ లేదా సరదా సన్నివేశాలు, గుర్తుంచుకోవల్సిన అంశాలు, లేటెస్ట్ ఫోటోలను ఫ్యాన్స్ తో.. నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియా ఓ అనువైన వేదిక. అందుకే ఇప్పటి వరకూ సోషల్ మీడియా అకౌంట్ లేని సీనియర్ స్టార్స్ అంతా రీసెంట్ గానే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. నటసింహం బాలయ్య బాబు, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ లాంటి వారు కూడా ఈ కోవలోని వారే.