విజయ్ కారును వెంబడించిన అభిమానులు, దళపతి చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాస్స్..

Published : Mar 19, 2024, 12:35 PM IST
విజయ్ కారును వెంబడించిన అభిమానులు, దళపతి చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాస్స్..

సారాంశం

కేరళభారీ ఫాలోయింగ్ ఉన్న  ఇతర భాషా నటులలో అల్లు అర్జున్ తో పాటు.. విజయ్ దళపతి కూడా ఉన్నారు. రీసెంట్ గా ఆయన కేరళ వెళ్ళగా.. అభిమానులు చేసిన హడావిడి తెగ వైరల్ అవుతోది.   

కేరళలో అత్యధిక అభిమానులను కలిగి ఉన్న ఇతర భాషా నటులలతో తెలుగు నుంచి అల్లు అర్జున్ ఉండగా..  తమిళనాట నుంచి  తలపతి విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడును మించి కేరళలో విజయ్ సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డులను సాధించాయి. విజయ్  క్రేజ్ అక్కడ ఎంత ఉందంటే.. కేరళలో  విజయ్ సినిమా రిలీజ్ అయ్యిందంటే..  అక్కడి ప్రముఖ నటీనటులు మాత్రం దానికి పోటీగా తమ సినిమాని రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఆ మేరకు నటుడు విజయ్‌కి కేరళలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

నటుడు విజయ్ చివరిసారిగా 2010లో కావలన్ షూటింగ్ కోసం కేరళకు వెళ్లారు. ఆ తర్వాత దాదాపు 14 ఏళ్ల తర్వాత తాజాగా షూటింగ్ కోసం  కేరళ వెళ్లాడు. ఆయన రాకను ముందుగానే తెలుసుకున్న అభిమానులు విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం  పలికేందుకు తరలిరావడంతో తిరువనంతపురం విమానాశ్రయం తలపతి అభిమానులతో కిక్కిరిసిపోయింది.

నిన్న సాయంత్రం ప్రైవేట్ విమానంలో తిరువనంతపురం చేరుకున్న విజయ్ అక్కడ గుమిగూడిన అభిమానులను చూసి కారు ఎక్కి వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం హోటల్‌కు వెళ్లే క్రమంలో తలపతి అభిమానులు ఆయనను చుట్టుముట్టడంతో తిరువనంతపురం సిటీ  స్తంభించింది. తర్వాత ఎలాగోలా పోలీసులు జనాన్ని చెదరగొట్టి విజయ్‌ని అక్కడి నుంచి పంపించారు.

 

అయితే అభిమానులు విజయ్ కారును వెంబడించి బైక్ నడుపుతూ వీడియో తీశారు. అభిమానుల ఈ చర్యను గమనించిన విజయ్, కారులో ఉండగా, రోడ్డు వైపు చూసి బైక్ నడపు మిత్రమా అంటూ వేడుకున్నారు.  దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. అటు అభిమానులు కూడా ఈ వీడియో చూసి.. విజయ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు.  తిరువనంతపురంలోని స్టేడియంలో విజయ్ తాజా చిత్రం షూటింగ్ జరగనుందని సమాచారం.

PREV
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే