పది భాషల్లో సూర్య సినిమా.. టైటిల్ రిలీజ్ ఎప్పుడంటే..?

By Mahesh JujjuriFirst Published Apr 12, 2023, 12:05 PM IST
Highlights

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ.. వరుస సక్సెస్ లు చూస్తూ.. సందడి చేస్తున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సూర్య ఇమేజ్ పెరుగుతూ వస్తోంది. తాజాగా పాన్ ఇండియాను టార్గెట్ చేశాడుసూర్య. 
 

కొత్త కొత్త కథలను ఎంచుకుుంటూ.. వరుసగా ప్రయోగాలు చేస్తూ.. పాత్రల విషయంలో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే హీరోలలో సూర్య ముందు వరుసలో ఉంటారు. మూస ధోరణికి చెక్ పెట్టి.. పెర్ఫామెన్స్ ఉన్న పాత్రలవైపు వెళ్తు.. వాటిని కమర్షియల్ వేలో సక్సెస్ వైపు నడిపించడంలో.. సూర్య టీమ్ కు సాటిలేదని చెప్పాలి. ఇప్పటి వరకూ  ఆయన చేసిన సినిమాలే ఇందుకు ఉదాహరణ.  ఇక తాజాగా సూర్య నుంచి 42వ సినిమా రిలీజ్ కు  రెడీ అవుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయాల్సి ఉంది.  

ఈ సినిమా కథాకథనాలు విభిన్నంగా ఉండనున్నాయి. అందువలన టైటిల్ ఎలా ఉండనుందనేది అభిమానులలో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు టీమ్. ఈ నెల 16వ తేదీన ఉదయం 9:05 నిమిషాలకు  సూర్య సినిమాకు టైటిల్ ను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ విధంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు టీమ్. 

Latest Videos

అడవిలో గుర్రం మీద హీరో.. విల్లు భాణాలతో.. గుర్రాలపై వేటాడే ఒక వేటగాడుగా సూర్య, ఆ గుర్రంపై ఒక కొండ కొస నుంచి మరో కొండపైకి జంప్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. పక్కనే ఆ గుర్రాన్ని అనుసరిస్తూ వేటకుక్క కూడా కనిపిస్తోంది. ఇక ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈమూవీలో సూర్య సరసన నయనతార .. దిశా పటాని హీరోయిన్లు గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈసినిమాను . పది భాషల్లో.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

click me!