
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా.. డ్యాన్స్ మాస్టర్ గా,హీరోగా.. డైరెక్టర్ గా.. నిర్మాతగా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నారు రాఘవ లారేన్స్. ఎన్నో ఏళ్ళ నుంచి తన విజయ పరంపర కొనసాగిస్తున్నారు. అటు సినిమాలు చేస్తూనే.. ఇటు సమాజ సేవ చేస్తూ.. అనాధలను చేరదీస్తూ.. వృద్థులకు సాయమందిస్తూ.. చిన్నారులను చదివిస్తూ.. సొంత ఖర్చులతో వందల మందికి ఆసరాగా నిలబడ్డారు రాఘవ లారెన్స్. ఇప్పటికే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు తన వంతు సాయం చేశారు. ఇక తాజాగా ఆయన మరో 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు రాఘవ లారెన్స్. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. నాణ్యమైన ఈ పిల్లలని చక్కగా చదివించి.. ప్రయోజకులను చేస్తామన్నారు రాఘవ. అంతే కాదు తనకు అభిమానుల ఆశీస్సులు.. ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పటికీ కావాన్నారు రాఘవ. ఇక తాజాగా రుద్రన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా ఆ చిన్నారులతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇక లారెన్స్ గొప్ప మనసుని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ , నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలో అనేక సందర్భాల్లో తన మంచి తనం చాటుకున్నారు రాఘవ. అప్పట్లో 141 మంది పిల్లలకు రకరకాల కేసుల్లో ఆపరేషన్లు చేయించారు రాఘవ లారెన్స్.. తమిళనాడు తోపాటు.. రెండు తెలుగు రాష్ట్రాలుల్లో చిన్నారులు చాలా మందికి హార్ట్ ఆపరేషన్లు చేయించారు రాఘవ.అంతే కాదు డబ్బుల కట్టలేక స్కూళ్లకు వెళ్ళలేని పిల్లలను . లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంటుందని..వెంటనే ట్రస్ట్ ను సంప్రదించాలని ఆయన కోరారు.
లారెన్స్ ది ఎంత గొప్ప మనసంటే.. డబ్బుతో ఇదంతా చేయడం ఎలా సాధ్యం అంటే.. అది నా డబ్బు కాదు, మీరు ఇచ్చిన డబ్బే.. తిరిగి మీకే ఇస్తున్నా అని చాలా గొప్పగా సమాధానం చెప్పారు రాఘవ. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీద ఉన్నాడు రాఘవ లారెన్స్. చంద్రముఖి సినిమాకుసీక్వెల్ చేస్తున్నారు. ఈలోపు ఆయన నటించిన రుద్రుడు సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. రీసెంట్గా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.