
తెలుగు, తమిళ సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని హీరో ధనుష్. సౌత్ ఆడియన్స్ కు మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఆడియన్స్ కు.. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రస్తుతం హాలీవుడ్ ఆడియన్స్ కు కూడా ధనుష్ సుపరిచితమే. క్లాస్, మాస్, స్టైలిష్..ఏ జోనర్ అయినా సరే.. తన యాక్టింగ్‌తో సినిమా రేంజ్ ను మార్చేసి.. క్రేజ్ పెంచేస్తుంటాడు ధనుష్. రికార్డ్స్ క్రియేట్ చేయడం. ట్రెండ్ సెట్ చేయడంలో ధనుష్ రూటే వేరు. ఇక రీసెంట్ గా మరో రికార్డ్ సాధించాడు స్టార్ హీరో.
తన హార్ట్ కోర్ ఫ్యాన్స్ కు ధనుష్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో రేర్ మైల్ స్టోన్ చేరుకున్నాడు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విటర్‌లో ధనుష్ ఫాలోవర్ల సంఖ్య 11 మిలియన్లు దాటింది. ఈ అరుదైన మైల్ స్టోన్ చేరుకున్న మొదటి కోలీవుడ్ నటుడిగా ధనుష్ నిలువడం విశేషం. ఇక అంతే కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన రెండో యాక్టర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీల్ గట్టిగా షికారు చేస్తోంది.
ఈ స్టార్ హీరో రీసెంట్‌గా మిత్రన్ ఆర్ జవహర్ డైరెక్షన్‌లో నటించిన సినిమా తిరు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తిరు సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ధనుష్.
అంతే కాదు ప్రస్తుతం ఆయన తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నాన్ వరువెన్ సినిమా చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్ రావాల్సి ఉంది. ఈ ఏడాది గ్రే మ్యాన్ ప్రాజెక్టుతో హాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు ధనుష్.
అంతే కాదు గ్రే మ్యాన్ పార్ట్ 2 లో కూడా ధనుష్ నటించబోతున్నట్టు హాలీవుడ్ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో తన భార్య నుంచి విడాకులుతీసుకున్నాడు ధనుష్. ప్రస్తుతం ఇద్దరు విడిగా ఉంటున్నారు. ఇక తెలుగులో డబ్బింగ్ సినిమాలతో పాపులర్ అయిన ధనుష్.. డైరెక్ట్ గా రెండు సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలలో ఒక సినిమా సార్ . ఈ షూటింగ్ జరుగుతోంది. మరో సినిమా శేఖర్ కమ్ములాతో చేయబోతున్నాడు ధనుష్.