కుళ్లిపోయిన దశలో సీరియల్‌ స్టార్స్‌ మృతదేహాలు.. ఆత్మహత్య చేసుకున్న అన్నా చెల్లెల్లు

Published : Jun 07, 2020, 10:52 AM IST
కుళ్లిపోయిన దశలో సీరియల్‌ స్టార్స్‌ మృతదేహాలు.. ఆత్మహత్య చేసుకున్న అన్నా చెల్లెల్లు

సారాంశం

తాజాగా కరోనా కారణంగా ఇండస్ట్రీలో పనిచేస్తున్న యువ నటీనటులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యే ఇండస్ట్రీలోకి వచ్చిన నటీనటులు లాక్ డౌన్‌ ప్రకటించటంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఒకటి రెండు నెలలు తమ దగ్గర ఉన్న డబ్బులతో సర్దుకున్నా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు.

కరోనా కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా సినిమా, టీవీ రంగాల్లో పనిచేసే వారి పరిస్థితి దుర్బరంగా మారింది, ఈ రంగాల్లో ఉన్న సీనియర్లు, స్టార్లు కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ ను హాలీడేస్‌లా ఎంజాయ్ చేస్తుంటే.. చిన్న చిన్న నటీనటులు, సాంకేతిక వర్గంలో పనిచేసే వారు మాత్రం పూటగడవని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా రోజువారి కూలి మీద పనిచేసేవారి పరిస్థితి మరింత ధయనీయంగా ఉంది.

తాజాగా కరోనా కారణంగా ఇండస్ట్రీలో పనిచేస్తున్న యువ నటీనటులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యే ఇండస్ట్రీలోకి వచ్చిన నటీనటులు లాక్ డౌన్‌ ప్రకటించటంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఒకటి రెండు నెలలు తమ దగ్గర ఉన్న డబ్బులతో సర్దుకున్నా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు. బయట అప్పు కూడా పుట్టే పరిస్థితి లేకపోవటంతో ఏ చేయలో పాలుపోక బలవన్మారణానికి పాల్పడుతున్నారు.

తాజాగా అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. తమిళ టీవీ సీరియల్స్‌లో నటించే శ్రీధర్, జయ కళ్యాణీలు ఆర్థిక సమస్యల కారణంగా  ఆత్మహత్య చేసుకున్నారు. వారు నివసిస్తున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులుకు ఇద్దరు విగత జీవులుగా కనిపించారు. శవాల పరిస్థితి చూస్తే వారు చనిపోయిన చాలా రోజులు అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా అవకాశాలు లేకపోవటంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద