నేను జగన్ అభిమానినంటూ... చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి స్పందించిన విశాల్.. ఏమన్నారంటే..?

తెలుగు దేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మరోసారి స్పందించారు తమిళ నటుడు, స్టార్ హీరో విశాల్. జగన్ కు తాను అభిమానినన్నారు విశాల్.. చంద్రబాబుఅరెస్ట్ పై ఏమన్నారంటే..? 

Tamil Hero Vishal Reacts Once again to chandrababu Arrest Issue JMS


టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి స్పందించారు హీరో విశాల్.  గతంలో ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు చాలా గొప్ప నాయకుడని గొప్ప నాయకుడని, ఆయనను అరెస్ట్ చేయడం బాధాకరమని విశాల్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని చూసి చాలా భయమేసిందని ఆయన చెప్పారు. చంద్రబాబులాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి వస్తే... తనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే తాజాగా మరోసారి ఇదే అశంపై ఆయన స్పందించారు. తాను జగన్ కు అభిమానినని.. తను అభిమానించే  రాజకీయ నాయకుడు జగనేనని... కాని చంద్రబాబు అరెస్ట్ విషయంలో  మాత్రం ఏపీ ప్రభుత్వం కాస్త లోతుగా ఆలోచించి ఉండాల్సిందని విశాల్ అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో మాత్రం తాను ఆవేదనకు గురవుతున్నానని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు ఏపీ సీఐడీ పోలీసులు మరింత లోతుగా ఆలోచించాల్సిందని, పక్కాగా ఆధారాలను సేకరించిన తర్వాత వెళ్లి ఉంటే బాగుండేదని అన్నారు. 

Latest Videos

ఇక తాను ఈ వ్యాఖ్యలను సినీ నటుడిగా మాత్రం చేయడం లేదని, ఒక సామాన్య వ్యక్తిగా తన అభిప్రాయం ఇదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలుగు దేశం అధినేత చంద్రబాబునాయుడికి అన్ని వార్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎవరూ స్పందించడం లేదు. రాజకీయ నాయకులుగా ఉన్నందున బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. నట్టికుమార్ లాంటి సంచల నిర్మాతలు ఈ విషయాన్ని డైరెక్ట్ గా వ్యాతిరేకిస్తే.. రాఘవేంద్రరావు, అశ్వీనీదత్ లాంటి వారు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ విషయంలో లోకేష్ కు ఫోన్ చేసి మాట్లాడారు. 

vuukle one pixel image
click me!