ఉదయనిధి స్టాలిన్ 'నాయకుడు' సినిమా రివ్యూ.. ఆడియన్స్ ను ఆలోచింపచేసిన సినిమా..!

Published : Jul 14, 2023, 05:38 PM IST
ఉదయనిధి స్టాలిన్ 'నాయకుడు' సినిమా రివ్యూ.. ఆడియన్స్ ను ఆలోచింపచేసిన సినిమా..!

సారాంశం

తమిళం నుంచి డబ్బ్ అయ్యి... చాలా సినిమాలు తెలుగులోమంచి విజయం సాధిస్తుంటాయి. చాలా మంది తమిళ తారలు డబ్బింగ్ సినిమాల వల్లే తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ను సంపాదించారు.అటువంటి ప్రయత్నాలు చేసిన వారిలో.. ఉదయనిధి స్టాలిన్ కూడా ఒకరు. ఆయన నటించిన తాజా సినిమా నాయకుడు. ఈసినిమా తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తెలుగులో ఎలాంటి రిజల్ట్ సాధించింది చూద్దాం. 


తమిళంలో మంచి విజయం సాధించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో వచ్చిన సినిమానే  'మామన్నన్..ను.  ఈసినిమాను తెలుగులో నాయకుడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. సురేష్ ప్రొడక్షణ్స్.. ఏషియన్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా రిలీజ్ చేసిన ఈసినిమా ఈరోజు(14 జులై) థియేటర్లలో సందడి చేసింది. మరి ఈసినిమా కు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి చూద్దాం.


ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తిమ్మరాజు (వడివేలు) ఒక వెనుకబడ్డ కులానికి చెందిన ఎమ్మెల్యే. అతని కొడుకు రఘువీర (ఉదయనిధి స్టాలిన్) . అవ్వడానికి ఎమ్మెల్యేనే అయినా.... కుల వివక్ష కారణంగా  ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ ఫ్యామిలీ. దాని కారణంగానే చిన్నతనంలో తన మిత్రులను కోల్పోయి.. చావు  అంచుల వరకూ వెళ్లి వస్తాడు రఘువీర. కాని వెనుకబడ్డ  కులం కావడంతో..అంత అన్యాయం జరిగినా తండ్రి ఏమీ చేయలేకపోతాడు.  అయితే ఇంత జరిగినా తన తండ్రి ఏం చేయలేక పోయాడనే కోపం తండ్రిలో  ఉంటుంది. అందువల్ల 15 ఏళ్లుగా ఇద్దరికీ మాటలు ఉండవు. ఇలా జరుగుతుండగానే.. పార్టీలో మంచి స్థాయికి వస్తాడు తిమ్మరాజు. ఎమ్మెల్యే అయినా కూడా.. తన పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న రత్నవేలు (ఫాహద్ ఫాజిల్) కుటుంబం నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉంటాడు.అయితే అనుకోకుండా  రత్నవేలు కుంటుంబంతో.. తిమ్మరాజు కుటుంబానికి ఏర్పడ్డ గొడవలు పెద్దవవుతాయి. గొడవలు పరిష్కరించించుకోడానికి  తిమ్మరాజుకు అక్కడ అవమానం ఎదురవుతుంది. దాంతో తండ్రీ కొడుకులపై విలన్ పగతీర్చుకోవడానికి  పంతం పూననుతాడు. మరి క్లైమాక్స్ ఏయయ్యింది. అనేది సినిమా చేసి తెలిసుకోవాల్సిందే. 


నాయకుడు సినిమా అంతా కుల వివక్ష మీదే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పాతుకుపోయిన  కుల వివక్ష విషయంలో ముందు వరసలో ఉన్న తమిళనాట పరిస్థితుల గురించి ఈ సినిమా అద్దం పడుతుంది.  కొన్ని దశాబ్దాల్లో కుల వివక్షపై  పరిస్థితులు కాస్త  మెరుగుపడ్డా కూడా ఇప్పటికీ కొన్ని దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి.  అయితే తమిళనాట దళితులపై జరుగుతునన అన్యాయాలకు సబంధించి ఎన్నో సినిమాలు వచ్చాయి.. నారప్ప, జైభీమ్ లాంటి సినిమాలతో పాటు.. పా రంజిత్ సినిమాలన్నీ ఇలాంటి వాటిమీదే ఆదారపడి ఉంటాయి. ఈకోవలో వచ్చిన సినిమానే నాయకుడు.   కుల వివక్ష బ్యాక్ గ్రౌండ్ తో సినిమా అంటే.. రోటీన్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ గా చూపించాలి అనుకున్నాడు దర్శకుడు. అందుకే  'నాయకుడు'లో ఆలోచింపజేసే కథతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే.. కమర్షియల్ టచ్ ఉన్న స్క్రీన్ ప్లే కూడా ఆకటుకుంటుంది. ందేశం ఇస్తూనే.. హీరోయిజం కూడా ఎలివేట్ చేశారు. యాక్షన్ సీన్స్ తో పాటు..  కథనమూ ఉంది. ఇందులో హీరోయిజం చూడొచ్చు. గూస్ బంప్స్ వచ్చే ఎమోసన్ సీన్స్ తో పాటు.. మంచి మెసేజ్ ఇస్తున్న సినిమా ఇది. 


ఇక ఈసినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. వడివేలు తన లైన్ కు భిన్నంగా.. డిఫరెంట్ గా నటించాడు. వడివేలు అనగానే మనకు ఆయన కామెడీ, నవ్వులు మాత్రమే  గుర్తుకు వస్తాయి. ఎన్నో తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా  ఆయన తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇప్పుడు 'నాయకుడు'లో వడివేలును చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఇంకా షాకవుతాం. టాలీవుడ్ లో నవ్వుల రారాజు బ్రహ్మానందం.. రంగమార్తాండలో చేసిన సీరియస్ పాత్రకు ఎంత తడబ్డామో..  'నాయకుడు లో వడిపేలు పాత్ర కూడా అలానే ఉంటుంది.  కథ కూడా ఆయనదే. ఆయన పాత్ర.. నటన 'నాయకుడు'లో మేజర్ హైలైట్. తనకున్న కామెడీ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి ఆయన ఇచ్చిన పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. తొలి సన్నివేశం నుంచి ఆ పాత్ర మీద ఏర్పడే ఆపేక్ష.. ప్రేక్షకులను ముందుకు నడిపిస్తుంది.  అంతే కాదు ఈసినిమాకు ఫాహద్ ఫాజల్ పాత్ర కూడా అద్బుతంగా పండింది. అటు వైపు ఫాహద్ ఫాజిల్ రూపంలో బలమైన విలన్ ఉండటం 'నాయకుడు'ఖు మరో పెద్ద ప్లస్. కథాకథనాల పరంగా కొంచెం వీక్ అనిపించినా.. వడివేలు నటన సినిమాకు హైలెట్.. అయితే హీరో గా ఉదయనిధి స్టాలిన్ పెర్ఫామెనస్ కాస్త మైనస్ అని చకప్పాలి.  ఎందుకంటే అలాంటి ఎక్స్ ప్రెషన్ లెస్ హీరో.. ఇలాంటి సినిమాలకు సెట్ అవ్వరంటున్నారు ఆడియన్స. ఓవైపు వడివేలు.. ఫాహద్ తమ నటనతో సినిమా స్థాయిని పెంచేలా కనిపించింది. 

ఇక టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే.. 'నాయకుడు'లో కుల వివక్ష.. అగ్ర వర్ణాల దురహంకారం.. అసమానతలు.. లాంటి విషయాలను చాలా ఇంటెన్స్ గా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. కాకపోతే సినిమాలో చూపించిన పరిస్థితులు ప్రస్తుతం తమిళనాడులో కూడా ఉన్నాయంటే నమ్మలేం. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు. కాబట్టి ఈ రోజుల్లో ఇలా జరుగుతుందా.. ఇంత తీవ్రత ఉందా అన్న సందేహాలు కలుగుతాయి. దీని వల్ల మన ప్రేక్షకులు ఇందులో చూపించే అంశాలతో అంతగా రిలేట్ కాకపోవచ్చు. ఐతే గుడికి సంబంధించిన బావిలో వెనుకబడ్డ కులానికి చెందిన కుర్రాళ్లు దూకి దాన్ని మలినం చేస్తున్నారని.. వారి మీద రాళ్లు విసిరి ప్రాణాలు తీసే ఎపిసోడ్.. ఆ తర్వాత పరిణామాలు చూసి ఎవ్వరైనా కదిలిపోవాల్సిందే. ఇక వడివేలు ఎమ్మెల్యే అయినా సరే.. అగ్ర వర్ణాల వ్యక్తుల ముందు నిలబడే ఉండటం మీద ఈ సినిమా మూల కథకు ముడిపెట్టి.. దాని మీద డ్రామాను నడిపించిన విధానంలోనూ మారి సెల్వరాజ్ తన ప్రతిభను చాటుకున్నాడు.


ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ చేశాడంటే ఎవరూనమ్మరు.. అంతే కాదు ఆయన రెగ్యూలర్ చేసే సినిమాలకు భిన్నంగా మంచి మ్యూజిక్ అందించాడు.  ముఖ్యంగా ఈసినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుది. తేని శేఖర్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు మారి సెల్వరాజ్.. తన స్టయిల్లోనే మరో ఇంటెన్స్ మూవీ తీశాడు. కానీ ఇందులో కొంచెం కమర్షియల్ టచ్ ఎక్కువ అయిపోయింది.దాని కారణంగా కథాకథనాల్లో కొంచెం బిగి తగ్గింది. ప్రథమార్ధంలో.. అలాగే కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లలో దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది.


ఓవర్ ఆల్ గా ఈసినిమా ఆలోచింపచేసే కాన్సెప్ట్ తో వచ్చింది. ఇటువంటి సబ్జెక్ట్స్ మీద అభిమనానం ఉన్నవారు.. ఈసినిమాను చూస్తారు. మరి అన్న వారాలను ఆకటటుకుంటుందా లేదా అనేది చూడాలలియరి

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ