
ప్రముఖ తమిళ సినీ నటుడు భరత్, జెస్లీ జోషువా దంపతులు..పండంటి కవలపిల్లలకు జన్మనిచ్చారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ చిత్రంతో భరత్.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు పరిచయమయ్యాడు.
ఆ తర్వాత ‘కాదల్, ‘చెల్లమే’, ‘నేపాలీ’ తదితర చిత్రాలలో నటించే హీరోగా అగ్రస్థానం చేరుకున్నారు. భరత్ తమిళ సినిమాలన్నీ దాదాపు తెలుగులోకి అనువాదం అవుతూ ఉంటాయి. ఆయన నటించిన ఓ తమిళ సినిమా తెలుగులో ప్రేమిస్తే పేరుతో విడుదల చేయగా.. భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
కాగా..కొన్ని సంవత్సరాల క్రితం భరత్ దంతవైద్యనిపుణురాలు జెస్లీ జోషువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జెసీకి ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఈ విషయాన్ని భరత్ ఆదివారం తన ట్విటర్‌లో ప్రకటించారు. తనకు కవలలు జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయనపేర్కొన్నారు.