నన్ను కిందకు లాంగేందుకు ప్రయత్నిస్తున్నారు.. విజయ్ ఎమోషనల్

Published : Aug 13, 2018, 02:25 PM ISTUpdated : Sep 09, 2018, 02:01 PM IST
నన్ను కిందకు లాంగేందుకు ప్రయత్నిస్తున్నారు.. విజయ్ ఎమోషనల్

సారాంశం

దీంతో హీరో విజయ్ దేవరకొండ డిప్రెషన్ కి లోనయ్యారు.  ఆదివారం విశాఖలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన బాధనంతా వెల్లగక్కాడు.  

‘‘అర్జున్ రెడ్డి’’ తో స్టార్ డమ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘ గీతా గోవిందం’. ఇప్పటికే సినిమా ట్రైలర్, పాటలు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరో రెండు రోజుల్లో సినిమా విడుదలౌతుందనగా.. చిత్ర యూనిట్ కి షాక్ తగిలింది.

సినిమాలోని రెండు సీన్లను ఎవరో లీక్ చేశారు. అవి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దీంతో హీరో విజయ్ దేవరకొండ డిప్రెషన్ కి లోనయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం విశాఖలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన బాధనంతా వెల్లగక్కాడు.

తనను కొందరు కిందికి లాగాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేశారని.. కానీ ఉనికి కోసం.. ఎదుగుదల కోసం.. గుర్తింపు కోసం పోరాడటం తనకు చిన్న తనం నుంచే అలవాటైందని.. తన జీవితమే పోరాటం  అని.. అలాంటపుడు ఇలాంటి వాటికి ఎంత మాత్రం భయపడేది లేదని విజయ్ అన్నాడు. ప్రేక్షకులకు ఆనందాన్నివ్వడం కోసం ఏమైనా చేస్తానని కూడా చెప్పాడు. అప్పటిదాకా ఒక నైరాశ్యంతో మాట్లాడిన విజయ్.. ఈ మాట అన్నాక స్వరం మార్చాడు. ఎప్పట్లాగే వాట్సాప్ రౌడీ బాయ్స్ అంటూ తన అభిమానుల్ని ఉత్సాహ పరిచాడు. 

ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ క్రేజ్.. సినిమా సినిమాకీ పెరిగిపోతుండటంతో కావాలనే సినిమాలోని క్లిప్స్ ని లీక్ చేశారా అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?