ప్రముఖ జానపద గాయని రాక్ స్టార్ రమణి మృతి.. తీవ్ర ఆర్థిక సమస్యలు, చనిపోయే ముందు కూడా..

Published : Apr 05, 2023, 12:48 PM IST
ప్రముఖ జానపద గాయని రాక్ స్టార్ రమణి మృతి.. తీవ్ర ఆర్థిక సమస్యలు, చనిపోయే ముందు కూడా..

సారాంశం

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ జానపద గాయని రమణి అమ్మాళ్ (69) మంగళవారం చెన్నైలో మృతి చెందారు. తన జానపద పాటలతో రాక్ స్టార్ రమణిగా ఆమె ఎంతో పాపులర్ అయ్యారు.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ జానపద గాయని రమణి అమ్మాళ్ (69) మంగళవారం చెన్నైలో మృతి చెందారు. తన జానపద పాటలతో రాక్ స్టార్ రమణిగా ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. తీవ్రమైన హార్ట్ ఎటాక్ రావడంతో రమణి మృతి చెందినట్లు తెలుస్తోంది. 

పలు వేదికలపై రమణి తన జానపద పాటలతో సంగీత ప్రియులని ఉర్రూతలూగించారు. ఎంతో ఎనెర్జిటిక్ గా పాటలు పాడుతూ ఆమె గుర్తింపు పొందారు. 2004లో హీరో భరత్ నటించిన కాదల్ చిత్రంలో తండట్టి కుప్పాయి అనే పాట రమణికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. 

ఆ తర్వాత 2017లో సరిగమప సీనియర్స్ షో ద్వారాల ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఆయా తర్వాత ఆమె కథావరాయణ్, తేనెవట్టు, హరిదాసు లాంటి చిత్రాల్లో పాటలు పాడారు. ఆ తర్వాత సినిమాల్లో రమణికి మరిన్ని ఆఫర్స్ రాలేదు. 

కానీ అమెరికా, శ్రీలంక, సింగపూర్ లాంటి దేశాల్లో స్టేజి షోలు చేశారు. పలు టివి సీరియల్స్ లో కూడా నటించారు. కానీ ఆమె ఆర్థిక సమస్యలకు పాటల ద్వారా వచ్చిన సంపాదన ఏమాత్రం సరిపోలేదు. చనిపోయే ముందు వరకు కూడా ఆమె ఇళ్లల్లో పని మనిషిగా ఉన్నారని తెలుస్తోంది. మంగళ వారం రోజు తీవ్రమైన హార్ట్ ఎటాక్ రావడంతో రమణికి చికిత్స అందించే అవకాశం కూడా లేకుండా పోయింది. దీనితో ఆమె కన్ను మూశారు. 

తమిళ చిత్ర ప్రముఖులు, సంగీత అభిమానులు రమణి మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇండస్ట్రీ అద్భుతమైన గాయనిని కోల్పోయినట్లు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
Rashmi Gautam Marriage: యాంకర్‌ రష్మి పెళ్లి వార్త.. చేసుకునేది అతన్నే