మాజీ ప్రియుడికి ముద్దులు, సుస్మితా సేన్ పోస్ట్ వైరల్.. హార్ట్ సర్జరీ తర్వాత రెచ్చిపోతున్న విశ్వసుందరి

Published : Apr 05, 2023, 11:34 AM IST
మాజీ ప్రియుడికి ముద్దులు, సుస్మితా సేన్ పోస్ట్ వైరల్.. హార్ట్ సర్జరీ తర్వాత రెచ్చిపోతున్న విశ్వసుందరి

సారాంశం

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఆమె ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తుంటాయి.  47 ఏళ్ళు వచ్చినా ఆమె వివాహం చేసుకోలేదు.

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఆమె ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తుంటాయి.  47 ఏళ్ళు వచ్చినా ఆమె వివాహం చేసుకోలేదు. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని జీవితం సాగిస్తున్నారు. సుస్మితా సేన్ లైఫ్ లో పెళ్లి లేదు కానీ.. ప్రేమ, రిలేషన్ షిప్ వ్యవహారాలు చాలానే ఉన్నాయి.

గతంలో సుస్మితా సేన్ పలువురితో రిలేషన్ షిప్ మైంటైన్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. అయితే చివరగా సుస్మితా సేన్ తన కంటే వయసులో ఎంతో చిన్నవాడైన రోహ్మన్ షాల్ అనే యువకుడితో ప్రేమాయణం సాగించడం సంచలనం సృష్టించింది. రోహ్మాన్ తో సుస్మితా సీక్రెట్ గా ఏమీ ఎఫైర్ నడపలేదు. అఫీషియల్ గానే ఇద్దరూ కొంతకాలం రిలేషన్ లో ఉన్నారు. 

ఆ దృశ్యాలని కూడా సుస్మితా పలుమార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ కొన్ని నెలల క్రితం విడిపోయారు. కొన్ని రోజుల క్రితం సుస్మితా సేన్ హార్ట్ ఎటాక్ కి గురైంది. అయితే సకాలంలో సర్జరీ జరగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. తిరిగి నార్మల్ లైఫ్ లోకి వస్తున్నారు. 

తాజాగా సుస్మితా సేన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన దృశ్యాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. హార్ట్ సర్జరీ జరిగిన కొన్ని రోజులకే ఆమె జిమ్ లో ఎంతో రిస్క్ తో కూడుకున్న వర్కౌట్స్ చేస్తోంది. దీనితో నెటిజన్లు, అభిమానులు జాగ్రత్త వహించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సుస్మితా సేన్ వైద్యుల సలహా మేరకే జిమ్ వర్కౌట్స్ చేస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. 

ఇక్కడ మరో విషయం ఏంటంటే సుస్మితా సేన్ తో కలసి ఆమె మాజీ ప్రియుడు రోహ్మన్ కూడా వర్కౌట్స్ చేస్తున్నాడు. తన మాజీ ప్రియుడు సహకారంతోనే తాను ఇలా నార్మల్ అవుతున్నట్లు.. జిమ్ వర్కౌట్స్ లో పాల్గొంటునట్లు సుస్మితా పేర్కొంది. జిమ్ దృశ్యాల్ని పోస్ట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

సంకల్పం ఒక్కటే మార్గం.. ఇప్పుడు మరిన్ని వర్కౌట్స్ చేయగలుగుతున్నా. మరికొన్ని రోజుల్లో ఆర్య పార్ షూటింగ్ లో పాల్గొంటా. రొహ్మన్ నాకు కంపెనీ ఇస్తూ సహాయం చేస్తున్నాడు. రోహ్మాన్ కి, అలీషాకి నా ముద్దులు అంటూ మాజీ ప్రియుడు గురించి, తన కుమార్తె గురించి సుస్మితా పోస్ట్ పెట్టింది. 

ఆమె షేర్ చేసిన వీడియో గమనిస్తే రొహ్మన్.. సుస్మితా జాగ్రత్తగా వర్కౌట్స్ చేయడంలో సహాయపడుతున్నాడు. ప్రేమికులుగా విడిపోయినప్పటికీ వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. లేకపోతే ఇద్దరూ మళ్ళీ ఒక్కటయ్యారా అనేది కూడా తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి