కోలీవుడ్‌లో విషాదం.. `బంగారం` ఫేమ్‌ కమెడియన్‌ మదన్‌ బాబు‌ కన్నుమూత, కారణం ఇదే

Published : Aug 02, 2025, 08:46 PM IST
madhan bob

సారాంశం

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పవన్‌ కళ్యాణ్‌ `బంగారం`లో నటించి ఆకట్టుకున్న కమెడియన్‌ మదన్‌ బాబు కన్నుమూశారు.   

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్‌ మదన్‌ బాబు(71) కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

క్యాన్సర్‌తో మరణించిన మదన్‌ బాబు

 నటుడు మదన్‌ బాబు మరణానికి కారణం క్యాన్సర్‌ అని తెలుస్తోంది. చాలా రోజుల క్రితమే ఆయనకు క్యాన్సర్‌ ఎఫెక్ట్ అయ్యింది. ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. కానీ దాని తీవ్రత పెరగడంతో పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు కోలీవుడ్‌ మీడియా పేర్కొంది. మదన్‌ బాబు మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విచిత్రమైన హవభావాలతో నవ్వులు పూయించిన మదన్‌ బాబు

మదన్‌ బాబు గత నాలభై ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్నారు. ప్రారంభంలో కొన్ని సినిమాల్లో లీడ్‌ రోల్స్ చేసిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మెప్పించారు. కమెడియన్‌గా టర్న్ తీసుకున్నారు. హాస్యనటుడిగానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన ఫేస్‌ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. విచిత్రమైన హవభావాలతో ఆకట్టుకున్నారు. నవ్వులు పూయించారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చకున్నారు.

తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ `బంగారం`లో నటించిన మదన్‌ బాబు

మదన్‌ బాబు `1984లో వచ్చిన `నీంన్గల్‌ కేట్టవై` చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో విడుదలైన `ఆరు`, `జెమినీ`, `రన్‌`, `జోడీ`, `మిస్టర్‌ రోమియో`, `తెనాలి`, `ఫ్రెండ్స్`, `రెడ్‌` చిత్రాలతో ఆయన తెలుగు ఆడియెన్స్ కి కూడా దగ్గరయ్యారు. మదన్‌ బాబు తెలుగులో ఒకే ఒక్క సినిమా చేశారు. అది పవన్‌ కళ్యాణ్‌ `బంగారం` కావడం విశేషం.

 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ