భోళా శంకర్ ప్లాప్... అజిత్ ని లేపుతూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్న తంబీలు!

Published : Aug 13, 2023, 02:52 PM ISTUpdated : Aug 13, 2023, 03:19 PM IST
భోళా శంకర్ ప్లాప్... అజిత్ ని లేపుతూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్న తంబీలు!

సారాంశం

మామూలుగానే తమిళ తంబీలకు పైత్యం ఎక్కువ. భోళా శంకర్ పరాజయంతో అజిత్ ని లేపుతూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు.

తమిళ తంబీల గురించి తెలిసిందే. అన్నింట్లో మా తర్వాతే అంటారు. కిందపడ్డా తమదే పై చేయి అని చెప్పుకునే రకం. ఇక నిజంగానే ఆధిపత్యం వారిదైతే ఊరుకుంటారా... భోళా శంకర్ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో మా అజిత్ గ్రేట్ అంటున్నారు వారు. కేవలం ఆ కథ అజిత్ గ్రేట్ పెర్ఫార్మన్స్ వలన ఆడింది. చిరంజీవి వల్ల కాలేదంటున్నారు. సోషల్ మీడియాలో చిరంజీవిని ట్రోల్ చేశారు.

అందులోనూ పోటీగా విడుదలైన రజినీకాంత్ జైలర్ విడుదలైన భారీ విజయం సాధించింది. దీంతో తమిళులు భోళా శంకర్ హీరో చిరంజీవికి యాక్టింగ్ రాదన్నట్లు మాట్లాడుతున్నారు. ఇది చిరంజీవి ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో భోళా శంకర్ ని జైలర్ బీట్ చేసింది.

ఒక్క రోజు వ్యవధిలో బోళా శంకర్-జైలర్ విడుదలయ్యాయి. ఆగస్టు 10న విడుదలైన జైలర్ వరల్డ్ వైడ్ కుమ్మేస్తుంది. యూఎస్ లో ఈ మూవీ $ 3 మిలియన్ మార్క్ దాటేసింది. భోళా శంకర్ ఇంకా వన్ మిలియన్ కూడా టచ్ చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా జైలర్ భోళా శంకర్ చిత్రంపై ఆధిపత్యం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నైజాం ఏరియాలో జైలర్ మూడో రోజు వసూళ్లు భోళా శంకర్ రెండో రోజు వసూళ్ల కంటే ఎక్కువ కావడం షాకింగ్ పరిణామం. 

ఆగస్టు 11న విడుదలైన భోళా శంకర్ ఎంతటి దారుణ పరాజయం కానుందో ఇది తెలియజేస్తుంది. భోళా శంకర్ శనివారం రూ. 1 కోటి రూపాయల షేర్ అందుకుంది. అదే సమయంలో జైలర్ రూ. 1.65 కోట్ల షేర్ రాబట్టింది. జైలర్ కి సరైన థియేటర్స్ లేవని సమాచారం. మోస్ట్ రెవెన్యూ వచ్చే థియేటర్స్ లో భోళా శంకర్ ఉంది. ఈ కారణంగా జైలర్ కి వసూళ్లు తగ్గుతున్నాయట. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ రెండు వందల కోట్ల మార్క్ కి దగ్గరైంది. 

 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే