శివాజీ రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇక బిగ్‌ బాస్‌ శివన్న కొత్త అవతారం..

Published : Jan 16, 2024, 12:00 PM ISTUpdated : Jan 16, 2024, 04:34 PM IST
శివాజీ రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇక బిగ్‌ బాస్‌ శివన్న కొత్త అవతారం..

సారాంశం

బిగ్‌ బాస్‌ షోలో విన్నర్‌ పల్లవి  ప్రశాంత్‌తోపాటు శివాజీకి అంతే పేరు వచ్చింది. ఇంకా చెప్పాలంటే  ఆయకంటే శివాజీకే ఎక్కువ క్రేజ్‌ వచ్చింది. ఆ క్రేజ్‌ని తనకు అనుకూలంగా మల్చుకుంటున్నాడు శివాజీ. 

నటుడు శివాజీ హీరోగా అనేక సినిమాలు చేసి మెప్పించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గానూ మారి అలరించాడు. కొంత కాలం సినిమాలకు దూరమైన ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా మారారు. ఆ తర్వాత వాటికీ దూరమయ్యాడు. ఈ క్రమంలో ఆయన బిగ్‌ బాస్‌ షోలో పాల్గొన్నారు. బిగ్‌ బాస్‌ తెలుగు 7లో పాల్గొని అలరించారు. శివన్నగా పాపులర్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఆయన తనదైన గేమ్‌ తీరుతో మెప్పించారు. చాణక్యుడిగా పేరుతెచ్చుకున్నారు.  తన ఆటతో, మైండ్‌ గేమ్‌తో ఇతర కంటెస్టెంట్లని ఆడుకున్నారు. 

ఇక బిగ్‌ బాస్‌ షోలో విన్నర్‌ పల్లవి  ప్రశాంత్‌తోపాటు శివాజీకి అంతే పేరు వచ్చింది. ఇంకా చెప్పాలంటే  ఆయకంటే శివాజీకే ఎక్కువ క్రేజ్‌ వచ్చింది. ఆ క్రేజ్‌ని తనకు అనుకూలంగా మల్చుకుంటున్నాడు శివాజీ. పాపులారిటీని తనకు పాజిటివ్‌గా  చేసుకుని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇటీవల `90 మిడిల్‌ క్లాస్‌` వెబ్‌ సిరీస్‌తో మెప్పించాడు. ఇది విశేష ఆదరణ పొందింది. ఇక ఇప్పుడు సినిమా ఎంట్రీ ఇస్తున్నాడు. 

శివాజీ తాజాగా  ఈ విషయాన్ని ప్రకటించారు. తాను బిగ్‌ బాస్‌ లోకి వెళ్లి వచ్చాక తొలి సినిమాని ప్రకటించారు. తను ఒక కొత్త రకమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిపారు. ఇటీవల `కుర్మ నాయకి` అనే సినిమాని ప్రకటించారు. దీనికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌  ఇందులో మెయిన్‌ లీడ్‌ చేస్తుంది. హర్రార్‌ ఫాంటసీ మూవీగా ఇది తెరకెక్కుతుందని తలుస్తుంది. అయితే ఇందులో శివాజీ నటిస్తున్నారట. ఓ ముఖ్య పాత్రలో ఆయన కనిపిస్తారట. 

శివాజీ ఈ మూవీ గురించి చెబుతూ, `కూర్మ నాయకి` పోస్టర్‌ నచ్చిందని అనుకుంటున్నానని, రీఎంట్రీలో తాను చేయబోతున్న మొట్టమొదటి సినిమా ఇది అని, తాను ఏం చేయబోతున్నాడో, ఎలా ఉండబోతున్నాడో, తన పాత్ర ఎలా ఉండనుందో త్వరలోనే రివీల్‌ కానుందని తెలిపారు. ఇందులో ఓ కొత్త శివాజీ కనిపిస్తాడని, జస్ట్ వెయిట్‌ చేయాలి తెలిపారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఇందులో లీడ్‌ రోల్‌లో శివాజీ కనిపిస్తారని, ఆయన పాత్ర నెగటివ్‌గా ఉంటుందని తెలుస్తుంది.

ఈ మూవీకి హర్ష కడియాలా దర్శకత్వం వహిస్తున్నారు. రోహన్‌ ప్రొడక్షన్స్, ఎంఎం క్రియేషన్స్, కాళభైరవ ప్రొడక్షన్‌ పతాకాలపై కే విజిత  రావు నిర్మిస్తున్ఆరు. తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఇందులో శివాజీ ఎలా కనిపిస్తాడనేది చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు