పెళ్లి ప్రకటన చేసిన ప్రేమ జంట!

Published : Feb 14, 2019, 12:55 PM IST
పెళ్లి ప్రకటన చేసిన ప్రేమ జంట!

సారాంశం

తమిళ హీరో ఆర్య, సాయేషా సైగల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. 

తమిళ హీరో ఆర్య, సాయేషా సైగల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు.

ప్రేమికులరోజు సందర్భం పురస్కరించుకొని సాయేషా తన ప్రేమ, పెళ్లి విషయాలపై క్లారిటీ ఇచ్చేసింది. ''మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం.. మీ బ్లెస్సింగ్స్  కావాలి'' అంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్యతో ఉన్న ఫోటోని షేర్ చేసి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్యూటీ.

'మా తల్లితండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మా జీవితాలలో అతి ముఖ్యమైన రోజు గురించి షేర్ చేయాలనుకుంటున్నాం.. ఈ సరికొత్త జీవిత ప్రయాణంలో మీ ప్రేమాభిమానాలు కావాలంటూ' ట్వీట్ చేసింది సాయేషా. ఆర్య కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.

ఈ జంటకి సినీ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మార్చిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది. ప్రస్తుతం సూర్య 'కాప్పాన్' సినిమాలో ఆర్య విలన్ గా నటిస్తుంటే.. అదే సినిమాలో సాయేషా హీరోయిన్ గా నటిస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ
Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్