మెగాబ్రదర్స్ మందు ముచ్చట్లు!

Published : Feb 14, 2019, 12:12 PM IST
మెగాబ్రదర్స్ మందు ముచ్చట్లు!

సారాంశం

మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ, పాలిటిక్స్ ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో నాగబాబుకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చెడు అలవాట్లను దూరం పెట్టినట్లు చెప్పారు. 

మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ, పాలిటిక్స్ ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు. 

ఈ మధ్యకాలంలో నాగబాబుకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చెడు అలవాట్లను దూరం పెట్టినట్లు చెప్పారు. అప్పుడప్పుడు ఆల్కహాల్  తీసుకోవడం, నాన్ వెజ్ తినే అలవాట్లను పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టం చేశారు. తనకు సిగరెట్ తాగడమంటే చాలా ఇష్టమని కానీ తాగితే దగ్గు బాగా వస్తుందని దాన్ని వదిలేసినట్లు తెలిపారు.

ఇక తన అన్నదమ్ముల అలవాట్ల గురించి మాట్లాడుతూ.. ముగ్గురం(చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్) కూర్చొని తాగిన సందర్భాలు లేవని అన్నారు. తన అన్నయ్య చిరంజీవి రెగ్యులర్ తాగరని, ఏదైనా పార్టీ ఉంటే అప్పుడు మాత్రం తాగుతారని చెప్పారు.

ఇక కళ్యాణ్ బాబు అయితే మరీ తక్కువ అని వెల్లడించాడు. ముగ్గురూ కలిసి ఎప్పుడూ తాగలేదని కానీ కలిసి ఉండడం, భోజనం చేయడం, సరదాగా మాట్లాడుకోవడం చేస్తుంటామని వెల్లడించాడు. 

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?