తమన్నా మరో వెబ్‌ సిరీస్‌తోపాటు షో కూడా చేస్తుందా?

Published : Apr 25, 2021, 10:13 AM IST
తమన్నా మరో వెబ్‌ సిరీస్‌తోపాటు షో కూడా చేస్తుందా?

సారాంశం

తమన్నా మరో వెబ్‌ సిరీస్‌ చేసేందుకు రెడీ అవుతుందట. `ఆహా` కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేయాలని నిర్వహకులు తమన్నాని సంప్రదించగా అందుకు ఆమె ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది.

తమన్నా ఫస్ట్ టైమ్‌ `లెవెన్త్ అవర్‌` అనే వెబ్‌సిరీస్‌లో మెరిసింది. ఇది ఇటీవల `ఆహా`లో ప్రసారమైంది. ప్రవీణ్‌ సత్తార్‌ రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌కి మిశ్రమ స్పందన లభించినా, స్టార్‌ హీరోయిన్‌ అయిన తమన్నా అప్పియరెన్స్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు మరో వెబ్‌ సిరీస్‌ చేసేందుకు రెడీ అవుతుందట. `ఆహా` కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేయాలని నిర్వహకులు తమన్నాని సంప్రదించగా అందుకు ఆమె ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. దీనిపై దర్శకుడు వర్క్ చేస్తున్నట్టు సమాచారం. 

దీంతోపాటు తమన్నాతో ఓ టాక్‌ చేయాలని కూడా `ఆహా` నిర్వహకులు ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. సమంతతో ఇప్పటికే `సామ్‌జామ్‌`టాక్‌ షో చేసిన విషయం తెలిసిందే. దీనిలో స్టార్లు పాల్గొని సందడి చేశారు. సమంత సైతం తనదైన స్టయిల్‌లో షోని రక్తికట్టించింది. ఇప్పుడు తమన్నాతో దాన్ని మించి చేయాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకు హోస్ట్ గా తమన్నాని ఎంపిక చేయాలని భావిస్తున్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

మొత్తానికి తమన్నా సినిమాలతోపాటు వెబ్‌సిరీస్‌తోనూ బిజీగా కాబోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడు గోపీచంద్ తో `సీటీమార్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో జ్వాలారెడ్డిగా తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్‌ కోచ్‌గా కనిపించబోతుంది. దీంతోపాటు వెంకీతో `ఎఫ్‌3`, నితిన్‌తో `మ్యాస్ట్రో`, సత్యదేవ్‌తో `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు