15 ఏళ్ల కెరీర్ లో తొలిసారి.. రూల్ బ్రేక్ చేసి లిప్ లాక్, బెడ్ సీన్ లో తమన్నా.. ఎవరితోనో తెలిస్తే షాకింగే 

By Asianet NewsFirst Published Mar 16, 2023, 3:01 PM IST
Highlights

మిల్కీ బ్యూటీ తమన్నా అందాలకు పెద్ద పెద్ద స్టార్లు సైతం ఫిదా అయ్యారు. ఆమె అందం అలాంటిది. గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

మిల్కీ బ్యూటీ తమన్నా అందాలకు పెద్ద పెద్ద స్టార్లు సైతం ఫిదా అయ్యారు. ఆమె అందం అలాంటిది. గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై ఫ్యాన్స్ ని మైమరపింపజేసింది. 

తమన్నా టాలీవుడ్ టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి దాదాపు 15 ళ్లు గడుస్తోంది. ఈ పదిహేనేళ్లలో తమన్నా ఎలాంటి హద్దులు లేకుండగా గ్లామర్ షోతో రెచ్చిపోయిన చిత్రాలు చూశాం. కానీ తమన్నా ఇంతవరకు లిప్ లాక్ సన్నివేశంలో నటించడం కానీ, ఇంటిమేట్ సీన్ చేయడం కానీ చూడలేదు. ఎందుకంటే తాను అలాంటి సన్నివేశాల్లో నటించను కట్టుబాటు పెట్టుకుంది. తనకు తానే నిబంధన విధించుకుంది. 

కాగా పదిహేనేళ్ల తర్వాత తమన్నా తన రూల్ ని బ్రేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 30 ప్లస్ లో ఉన్న హీరోయిన్లు చాలామంది వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. గతంలో కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన లస్ట్ స్టోరీస్ అనే బోల్డ్ వెబ్ సిరీస్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ లో కియారా రెచ్చిపోయి నటించింది. 

ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ సీజన్ 2 తెరకెక్కుతోంది. త్వరలో ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. సీజన్ 2లో తమన్నా కూడా నటిస్తోంది. అంతే కాదు ఆమె ప్రియుడిగా రూమర్స్ వస్తున్న విజయ్ వర్మ కూడా నటిస్తున్నాడు. నీనా గుప్తా, కాజోల్ లాంటి సీనియర్ నటీమణులు సైతం ఇందులో కనిపించనున్నారు. 

అయితే తమన్నా తన రూల్ ని బ్రేక్ చేసి ఈ సిరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో లిప్ లాక్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సీన్స్ తో రెచ్చిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తమన్నా గతంలో ఎప్పుడూ క్రేజీ హీరోలెవ్వరితో రొమాంటిక్ సీన్స్ చేయలేదు. కానీ అంతగా పాపులర్ కానీ విజయ్ వర్మతో ఇంటిమేట్ సీన్స్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రియుడి కోసం తన కట్టుబాటునే త్యాగం చేస్తోంది అని అంటున్నారు. 

తమన్నా మాత్రం తనకు ఎలాంటి లవ్ అఫైర్స్ లేవని చెబుతోంది. కానీ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో విజయ్ వర్మ తమన్నాకి టమాటో అని ముద్దు పేరు పెట్టాడు. 

click me!