Krishna Mukundha Murari: భవాని మాటని లెక్కచేయని కృష్ణ, మురారి.. నందినికి ట్రీట్మెంట్ ఇస్తున్న గౌతమ్!

Published : Mar 16, 2023, 01:40 PM IST
Krishna Mukundha Murari: భవాని మాటని లెక్కచేయని కృష్ణ, మురారి.. నందినికి ట్రీట్మెంట్ ఇస్తున్న గౌతమ్!

సారాంశం

Krishna Mukundha Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందరి మనసుల్ని దోచుకుంటున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మిగిలిన సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఇక ఈరోజు మార్చి 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో నందుకి భోజనాన్ని తీసుకువెళ్తుంది కృష్ణ. నందు కనిపించమంటే నీ చేతులతో తినటం అలవాటు చేసుకోమన్నాను కదా అంటూ ఎలా తినాలో చెప్తుంది. ఆమెకి గౌతమ్ కళ్ళు గుర్తుకొచ్చి తల తిరిగినట్లుగా అనిపిస్తుంది. ఏం జరిగింది అంటుంది కృష్ణ. ఇందాక నీతో వచ్చిన అబ్బాయి ఎవరు అంటుంది  నందు.

మా సీనియర్ డాక్టర్ గౌతమ్ అంటుంది కృష్ణ. అవునా మరి నాకు ఈ అబ్బాయిని చూస్తే సిద్దు ఏ గుర్తొచ్చాడు అంటుంది నందు. అసలు సిద్దు ఎవరు అంటుంది కృష్ణ. గుర్తు చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది కానీ తలనొప్పి రావటంతో ఆ ప్రయత్నాన్ని విరమిస్తుంది. వద్దులే ముందు భోజనం చెయ్యు అంటుంది కృష్ణ. నందిని ఇలాగ మారటానికి ఆ సిద్దు కి ఏమైనా సంబంధం ఉందా.

నందిని సిద్దు పేరు ఎత్తగానే అందరూ ఆరోజు ఎందుకలా బిగుసుకుపోయారు అనుకుంటుంది. తన రూమ్ కి వచ్చిన తర్వాత ఆకలితో బాధపడుతూ ఉంటుంది కృష్ణ. ఇదేమైనా ఇల్లా, అండమాన్ జైలా ఇవేం రూల్స్ అనుకుంటుంది. అంతలో అక్కడికి వచ్చిన మురారి  పడుకోడానికి మంచ మెక్కుతాడు. కడుపునిండా బాగా తిన్నట్లుగా ఉన్నారు అని కోపంగా అంటుంది కృష్ణ. 

ఏం టెస్టు, భోజనం ఎంత బాగుందో అంటూ ఆమెని మరింత రెచ్చగొడతాడు మురారి. ఎందుకు చెప్తున్నారు అంటుంది కృష్ణ. నేను మా గురించి చెప్తున్నాను అంటాడు మురారి. ఇక్కడ కడుపు మాడుతున్నది కూడా ఆ గురూజీ కూతురికే  మీ గురుభక్తి ఏడ్చినట్లుగా ఉంది అంటుంది కృష్ణ. నీకు ఇగో ఇంత ఉందనుకోలేదు అంటాడు మురారి. నా కడుపులో ఆకలి రోకలితో దంచేస్తుంది అంటుంది కృష్ణ.

నా కడుపు మంట ఇంకా చల్లారలేదు అంటాడు మురారి. ఏసీపి సర్ మంచోడు అనుకున్నాం కదా నాన్న చూడు ఎంత మంచోడో, ఈయనకే కాదు దీని ఫ్యామిలీలో అందరికీ గోరోజనం బాగా ఎక్కువగా ఉంది అంటూ తండ్రి ఫోటో కి చెప్పుకుంటుంది కృష్ణ. నన్నేమైనా అను నా ఫ్యామిలీని ఏమి అనకు అంటాడు మురారి. నాకు ఆకలేస్తుంది కానీ ప్రశ్న అంటే నాకు కూడా ఆకలేస్తుంది అంటాడు మురారి.

ఇప్పుడే కదా పీకలదాకా మెక్కి వచ్చారు అంటే  నువ్వు ఆకలితో ఉంటే నేను మాత్రం ఎలా తింటాను అంటాడు మురారి. ఏ సినిమాలో డైలాగ్ అంటుంది కృష్ణ. నిజమే చెప్తున్నాను అంటాడు మురారి. అయ్యో పనిష్మెంట్ ఇచ్చింది నాకు మీకు కాదు పదింటి వడ్డిస్తాను అంటుంది కృష్ణ. నువ్వు ఆకలితో వడ్డిస్తే నేను తినలేను మరీ అంత రాక్షసుడిని కాదు అంటాడు మురారి. వెళ్లి తినండి అంటుంది కృష్ణ.

కుదిరే పని కాదు గాని మనం బయటకు వెళ్దాం పదా పెద్దమ్మ బయటకు వెళ్లి తినొద్దు అనలేదు కదా అంటాడు మురారి. మ్యాజిక్ బాగుంది ఇప్పుడు పోలీస్ అనిపించారు అంటుంది కృష్ణ. కారు తీస్తే అందరికీ తెలిసిపోతుంది మధుకర్ రూమ్లో బైక్ కీస్ ఉంటాయి అవి తీసుకొని కామ్ గా వెళ్ళిపోదాం అంటాడు మురారి. మీరు దొంగా,పోలీసా అని నవ్వుతుంది కృష్ణ.

ఏ షాపు తెరిచి ఉండకపోవటంతో  కంగారుపడుతుంది కృష్ణ. ఆకలేస్తుంది అంటూ గోల పెడుతుంది. దూరంగా టిఫిన్ బండి కనిపిస్తుంది. అక్కడ ఆపి టిఫిన్ అడిగితే కొట్టు కట్టేసే టైం అయింది టిఫిన్ ఏమి లేదు అంటాడు షాపు ఓనర్. సార్ ఎవరనుకున్నావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మర్యాదగాలని దోస్తులు వేసి ఇవ్వు లేకపోతే ఈ బండిని ఇక్కడ ఉండనివ్వరు అని బెదిరిస్తుంది కృష్ణ.

మీరు కూర్చోండి ఇప్పుడే వేసిస్తాను అంటూ దోసెలు వేసిస్తాడు. కబుర్లు చెప్పుకుంటూ దోసెలు తింటారు. మరోవైపు మురారి ఎక్కడ తన భార్యకి దొంగతనంగా ఫుడ్ తినిపిస్తున్నాడేమో అనుకొని వాళ్ళ రూమ్ కి వెళ్లి చెక్ చేస్తుంది ముకుంద. అక్కడ ఎవరు లేకపోవడంతో బయటకు వెళ్లి టిఫిన్ చేస్తున్నట్లుగా ఉన్నారు చెప్తాను మీ సంగతి అనుకుంటుంది ముకుంద.

మరోవైపు బండి మీద వస్తున్న కృష్ణ ఐస్ క్రీమ్ తింటూ మీరు కూడా ఐస్ క్రీమ్ తినటం నేర్చుకోండి రేపు ఎప్పుడైనా నేను వెళ్ళిపోతే ఐస్క్రీం తిన్నప్పుడల్లా నేను గుర్తుకు రావాలి అంటుంది. మాటిమాటికి వెళ్లడం గురించి గుర్తు చేయకు అంటాడు మురారి. నేను వెళ్లకపోయినా మీ వాళ్ళు గెంటేస్తారు అంటుంది కృష్ణ. ఇంటికి వచ్చేస్తారు కృష్ణ మురారి. కృష్ణ నోటికి అంటుకున్న ఐస్ క్రీమ్ ని తుడుస్తాడు మురారి.

అది చూసి భరించలేక పోతుంది ముకుంద. లోపలికి వచ్చిన ఇద్దరికీ ముకుంద ఎదురవుతుంది. ఇద్దరు షాక్ అవుతారు. లవ్ బర్డ్స్ లో ఇద్దరు ఎక్కడికి వెళ్లి వస్తున్నారు? అంటే బయటకు వెళ్లి వస్తున్నాం,నువ్వు ఎందుకు సెక్యూరిటీ లాగా హాల్ మధ్యలో నుంచున్నావు అంటుంది కృష్ణ. కృష్ణకి పెద్ద అత్తయ్య పనిష్మెంట్ ఇచ్చింది కదా ఆవిడ మాటంటే మీ ఇద్దరికీ లెక్కలేదా.

అర్ధరాత్రి బండి మీద బయటకు వెళ్లారంటే ఏంటి అర్థం అంటూ నిలదీస్తుంది ముకుంద. ఇందులో నిలబెట్టి నెల తీసే అంత తక్కువ ఏముందో నాకు అర్థం కావట్లేదు. అర్ధరాత్రి నిద్రపోకుండా మన గురించి హారాలు తీస్తూ ఈవిడ  ఇక్కడ ఏం చేస్తుంది. పక్క గదిలో మొగుడు పెళ్ళాలు గురించి ఊపి లాగడమే ఈవిడ పనా అంటుంది కృష్ణ. వింటున్నావా మురారి నీ భార్య ఎలాగ మాట్లాడుతుందో అంటాడు మురారి.

ఆదర్స్ భార్య ఎలా మాట్లాడుతుందో చూడండి ఏసీపి సార్ అంటుంది కృష్ణ. నేనేమీ తప్పు అనలేదు కదా అంటుంది ముకుంద. నా భర్తని నువ్వు ఎందుకు నిలదీస్తున్నావు. నా భర్త నన్ను బయటకు తీసుకెళ్తే నీకేంటి బాధ. ట్యాంక్ బండి దగ్గర డ్యూయెట్లు పాడుకుంటాము  నీకేంటి ఇబ్బంది అంటుంది కృష్ణ. నీ భార్య ఎలా సమాధానం చెబుతుందో చూసావా అంటుంది ముకుంద.

  మధ్యలో నా మొగుడిని ఎందుకు లాగుతావు అంటుంది కృష్ణ. నాకు ఆకలేస్తుంది భర్తగా చూడలేక బయటకు తీసుకెళ్లి తినిపించాడు. అందులో తప్పేముంది అయినా ప్రతిసారి ఎందుకు మా ఇద్దరి మధ్యలో దూరిపోతావు. కడుపునిండా శుభ్రంగా తిన్నాను. స్వీట్ పాన్ వేసుకున్నాను తర్వాత మా ఆయన ఐస్ క్రీమ్ కొంటే అది కూడా తిన్నాను చాలా, అంటూ వెటకారంగా మాట్లాడుతుంది కృష్ణ.

ఇదే పెద్ద అత్తయ్యతో చెప్తాను అంటుంది ముకుంద ఆల్ ద బెస్ట్ అంటూ మురారిని చేయి పట్టుకొని తన రూమ్ కి తీసుకొని వెళ్ళిపోతుంది కృష్ణ. చాలా ఎక్కువ చేస్తుంది ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయే అగ్రిమెంట్ పెళ్ళాం నా మొగుడు వీళ్ళిద్దరి గురించి పెద్ద తీగ చెప్పి ఇంటికి ఎంత బాగా తీర్చుకుంటాను అనుకుంటుంది.

తరువాయి భాగంలో ఈ నిబంధనలను  అతిక్రమించినందుకు అంటూ కృష్ణ వాళ్లకి ఏదో పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటుంది భవాని కానీ ఇంతలోనే కృష్ణ అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది నందిని. ఆమెని హాస్పిటల్ కి చేరుస్తారు. అక్కడ గౌతమ్ ట్రీట్మెంట్ చేయడానికి వస్తాడు కానీ అతన్ని ఎవరో గుర్తుపట్టరు. అతని స్పర్శని నందిని గుర్తు పడుతుంది.

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్