తమన్నాని పోల్చడానికి వేరే పండేమి దొరకలేదా.. మిల్కీ బ్యూటీ ముద్దు పేరు మార్చేసిన ప్రియుడు

Published : Feb 25, 2023, 02:20 PM IST
తమన్నాని పోల్చడానికి వేరే పండేమి దొరకలేదా.. మిల్కీ బ్యూటీ ముద్దు పేరు మార్చేసిన ప్రియుడు

సారాంశం

తమన్నా పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఎలాంటి రూమర్స్ వినిపించలేదు. కానీ ప్రస్తుతం తమన్నా ఘాడమైన ప్రేమలో మునిగితేలుతోంది.  నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు స్పష్టమైంది.

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. అయితే తమన్నా పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఎలాంటి రూమర్స్ వినిపించలేదు. 

కానీ ప్రస్తుతం తమన్నా ఘాడమైన ప్రేమలో మునిగితేలుతోంది.  నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు స్పష్టమైంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా విజయ్ వర్మకి తమన్నా ముద్దు పెడుతున్న పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. వీళ్ళిద్దరూ బయట చెట్టా పట్టాలేసుకుని కూడా తిరిగారు. 

ఫ్యాన్స్ అంతా తమన్నాని ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. అందరూ పిలిచినట్లే తాను కూడా తమన్నాని పిలిస్తే స్పెషల్ ఏముంది అని అనుకున్నాడో ఏమో.. తమన్నాకి విజయ్ వర్మ కొత్త ముద్దు పేరు పెట్టాడు. తమన్నాకి ఆయన పెట్టిన ముద్దు పేరు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. తమన్నాని పోల్చడానికి వేరే పండ్లేమి లేనట్లు.. ఆమెని టమాటోతో పోల్చాడు. తమన్నాని ముద్దుగా 'టమాటర్' అని పిలుస్తున్నాడు. 

విజయ్ వర్మ, సోనాక్షి సిన్హా నటించిన దాహాడ్ వెబ్ సిరిస్ ని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సోనాక్షి సిన్హా, విజయ్ వర్మ అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తన ప్రియుడు నటించిన సిరీస్ కాబట్టి తమన్నా సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది. కంగ్రాట్స్ టీం అని పోస్ట్ పెట్టింది. 

తమన్నా పోస్ట్ కి విజయ్ వర్మ కూడా రియాక్ట్ అయ్యాడు.. కాకపోతే కాస్త రొమాంటిక్ గా.. థ్యాంక్స్ టమాటర్ అని కామెంట్ చేసి టమాటో ఎమోజి పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లంతా తమన్నాని పిలవడానికి వేరే పండ్లేమి దొరకలేదా అని కామెంట్స్ చేస్తున్నారు.  ఫ్యాన్స్ అంతా మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటే విజయ్ వర్మ ఆమె ముద్దుపేరుని టమాటోగా మార్చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?