'సైరా' నాకు అమేజింగ్ ఎక్స్పీరియన్స్.. ఆ పని పూర్తి చేసిన తమన్నా!

Published : Sep 11, 2019, 06:16 PM IST
'సైరా' నాకు అమేజింగ్ ఎక్స్పీరియన్స్.. ఆ పని పూర్తి చేసిన తమన్నా!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చిరంజీవి ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కలల ప్రాజెక్టు ని రాంచరణ్ 200 కోట్ల బడ్జెట్ లో నిర్మించడం విశేషం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రంతో ప్రేక్షకులని మెప్పించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 

సైరా చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్. తమన్నాసైరా చిత్రం గురించి తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది. ఈ చిత్రంలో తమన్నా లక్ష్మీ పాత్రలో నటిస్తోంది. 

'సైరా చిత్రానికి హిందీ డబ్బింగ్ పూర్తి చేశా. సైరా చిత్రం, లక్ష్మి పాత్ర నాకు ఓ గొప్ప అనుభూతి. మీఅందరిని థియేటర్స్ లో కలుసుకుంటా అని తమన్నా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఎడిటింగ్ స్క్రీన్ పై అందంగా ఉన్న తన ఫోటోని తమన్నా షేర్ చేసింది. 

 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌