
తమన్నా, జాన్ జోడీ రోహిత్ శెట్టి తదుపరి సినిమాలో భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఈ సినిమా ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బయోపిక్ అని చెప్తున్నారు. ఈ సినిమాలో తమన్నా, ప్రీతి మారియా పాత్ర పోషించనుంది. ఇది యాక్షన్ మూవీ అని టాక్.
స్త్రీ 2 ఐటెం సాంగ్ తర్వాత తమన్నాకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఆమె రోహిత్ శెట్టి తదుపరి సినిమాలో నటించనుంది. ఈ సినిమాలో తమన్నా, జాన్ భార్యగా నటిస్తుందని టాక్.
రోహిత్ శెట్టి సినిమాలో తమన్నా ప్రీతి మారియాగా కనిపించనుంది. ప్రీతి తన భర్త రాకేష్ కి ఎప్పుడూ అండగా నిలిచింది. కష్ట సమయాల్లో కూడా అతనికి తోడుగా ఉంది.
ప్రీతి మారియా పాత్ర పోషించడం తనకి గౌరవంగా ఉందని తమన్నా చెప్పింది. ఈ సినిమాలో జాన్ తో ఆమె మళ్ళీ జత కట్టనుంది. ఇంతకు ముందు వేద సినిమాలో జాన్ భార్యగా అతిథి పాత్రలో కనిపించింది.