వైద్యానికి కూడా డబ్బుల్లేక.. ధీనస్థితిలో మృతి చెందిన ‘షాపింగ్ మాల్’ నటి.. ఏమైందంటే?

By Asianet News  |  First Published Aug 7, 2023, 3:41 PM IST

వైద్యానికి కూడా డబ్బుల్లేక నటి మరణించడం బాధకలిగిస్తోంది. అంజలితో నటించిన యాక్ట్రెస్ సింధూ ఈరోజు కన్నుమూసింది. ధీనస్థితిలో మృతి చెందడం అందరినీ కలిచివేస్తోంది. 


టాలీవుడ్ హీరోయిన్  అంజలి (Anjali) తో కలిసి ‘షాపింగ్ మాల్’ సినిమాలో మెరిసిన నటి సింధూ ఈరోజు మరణించారు. 44 ఏళ్ల వయస్సులోనే ఆమె మరణించడం పట్ల ఆమె శ్రేయోభిలాషులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నారు. అయితే మృతి కారణాలు కూడా ఇలా తెలుస్తోంది. 

2020లో సింధు రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఆమెది మధ్య తరగతి జీవితం కావడంతో సరైన చికిత్స అందలేదు.  చేతులో డబ్బుల్లేకపోవడంతో ఇంట్లోనే వైద్యం చేయించుకుంటోంది. కొన్ని రోజుల కింద వరకు ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల వ్యాధి ముదరడంతో కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్రత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. కానీ అందుకు సరిపడా డబ్బుల్లేక మెరుగైన వైద్యం అందుకోలేకపోయింది. 

Latest Videos

చిన్న వయస్సులోనే నటి సింధూ మరణించడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. అదీ వైద్యానికి డబ్బుల్లేక ధీనస్థితిలో మరణించడం అందరినీ బాధిస్తోంది. ఆమె మరణవార్త తెలుసుకున్న తోటి నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారకు. ‘షాపింగ్ మాల్’ చిత్రంతో పాటు సింధూ మరిన్ని సినిమాల్లోనూ మెరిసింది. బాలనటిగానూ కొన్ని సినిమాలు చేసింది. పేద కుటుంబంలో జన్మించిన ఆమెకు 14వ ఏటనే పెళ్లి అయ్యింది. ఏడాదిలోపు ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. 

ఆమె మరణంతో తోటీ నటీనటులు, కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ సినిమాలో నటించిన తమిళ యాక్టర్ మోహన్ కూడా ధీనస్థితిలో మరణించిన విషయం తెలిసిందే. డబ్బుల్లేక, అవకాశల్లేక బిక్షాటన చేసి... ఆరోగ్యం కూడా క్షీణించడంతో మరణించారు. ఈలోపే సింధూ మరణ వార్త అందడం బాధాకరం.

click me!