తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించిన `వినరో భాగ్యము విష్ణు కథ` టీమ్‌..ఎందుకంటే?

Published : Feb 13, 2023, 04:01 PM IST
తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించిన `వినరో భాగ్యము విష్ణు కథ` టీమ్‌..ఎందుకంటే?

సారాంశం

"వినరో భాగ్యము విష్ణు కథ" టీమ్‌ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ లో పన్నెండు తరాలకు సంబంధించిన  శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించడం విశేషం. 

కుర్ర హీరో కిరణ్‌ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాలో ఏదో ఒక విషయం ఉంటుందనే పేరైతే సంపాదించాడు. కాకపోతే గత సినిమాలు ఆశించిన రిజల్డ్ ని సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన `వినరో భాగ్యము విష్ణుకథ` ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అందరినిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికితోడు టీజర్‌, ట్రైలర్‌, `వాసవ సుహాస` పాటకి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఈ పాటే సినిమాకి హైప్‌ తీసుకొచ్చింది. 

ఇదిలా ఉంటే ఆదివారం ఈ చిత్ర ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. తిరుపతి వేదికగా ఈ వేడుక జరపడం విశేషం. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న  థియేటర్స్ లో భారీగా విడుదల కాబోతుంది. ఈ తరుణంలో సినిమా ప్రోమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా "వినరో భాగ్యము విష్ణు కథ" చిత్ర యూనిట్ తిరుమల శ్రీ వేంటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఈ సినిమా ఎక్కువ శాతం తిరుపతిలోనే జరిగింది. దీంతో చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను కూడా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. సినిమా ప్రొమోషన్స్ మొదలు పెట్టినప్పటినుండి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చిత్ర యూనిట్. కళా తపశ్వి కే విశ్వనాధ్ గారిచే "వాసవ సుహాస" పాటను లాంచ్ చేయడం అందరి అటెన్షన్‌ పెరిగింది. పైగా ఆదివారం ఆడియో లాంచ్ ఈవెంట్ లో పన్నెండు తరాలకు సంబంధించిన  శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించడం విశేషం. వాళ్లు  సినిమాలోని `సోల్‌ ఆఫ్‌ తిరుపతి` అంటూ సాగే నాల్గొవ పాటని ఆవిష్కరించడం విశేషం.

ఒకవైపు సామాన్య ప్రజలచే సాంగ్స్ లాంచ్ చేయించడంతో పాటు, మరోవైపు పెద్దలకు తగిన గౌరవం ఇస్తూ వాళ్ళతో కొన్ని పాటలను లాంచ్  చేయించడం ఈ చిత్ర యూనిట్ ప్రత్యేకత. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ సభ్యుల మన్ననలు పొంది U/A సర్టిఫికెట్ ను సాధించుకుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను,  GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు