కియారా అద్వానికి సర్ ప్రైజ్ ఇచ్చిన RC15 టీమ్, దిల్ ఖుష్ అయిన కొత్త పెళ్ళికూతురు

Published : Feb 13, 2023, 02:56 PM IST
కియారా అద్వానికి సర్ ప్రైజ్ ఇచ్చిన RC15 టీమ్, దిల్ ఖుష్ అయిన కొత్త పెళ్ళికూతురు

సారాంశం

కియారాకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు RC15 టీమ్. రీసెంట్ గా హీరో సిద్దార్ధ్ ను పెళ్ళాడిన బాలీవుడ్ హీరోయిన్ కు షూటింగ్ సెట్ నుంచే సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.   


రీసెంట్ గా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది స్టార్ హీరోయిన్ కియారా అద్వాని. బాలీవుడ్ హీరో సిద్థార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్ళాడింది. రాజస్థాన్ రాజమహల్ లో పెళ్ళి చేసుకున్న ఈ జంట.. నిన్న ముంబయ్ లో గ్రాండ్ గా రిసెప్షపన్ కూడా ఏర్పాటు చేశారు. బాలీవుడ్ నుంచి తారాలోకం అంతా దిగివచ్చి.. దంపతులను ఆశీర్వదించారు. అయితే టాలీవుడ్ నుంచి రాశీ ఖన్నా లాంటి కొంత మంది మాత్రమేకనిపించారు. ఈక్రమంలో కియారా ప్రస్తుతం రామ్ చరణ్ జోడీగా RC15 లో నటిస్తుంది. ఇక RC15 టీమ్ కియారాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు. 

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ RC15. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా కియారా తాజాగా బాలీవుడ్‌ నటుడు సిద్దార్థ్‌ మల్హోత్రాను వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా RC15 టీమ్ సర్ ప్రైజింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ జోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. టీమ్ అంతా పూలు పట్టుకుని ఒకేసారి చల్లుతూ సర్ ప్రూజ్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట  వైరల్‌ అవుతుంది. 

 

ఈ వీడియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు..డైరెకక్టర్ శంకర్.. నిర్మాత దిల్ రాజు మూవీ టీమ్ అంతా ఉన్నారు. కాగా తాజాగా ఈ వీడియోపై కియారా స్పందించింది.మీరు చేసిన ఈ పని నాకెంతో ఆనందాన్నిచ్చింది. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టా లో.. స్టోరీలో పెట్టింది. ఇలా RC15 టీమ్‌ మొత్తం కలిసి విష్ చేసేవరకూ కియారా థ్రిల్ అయ్యింది. అటు మెగా ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్అవుతున్నారు. 

ఇక సినిమా విషయానికి వస్తే.. వైజాగ్ లో షూటింగ్ జరుగుతుండగా.. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్‌ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. సినిమాపై రోజు రోజుకి  అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్‌.జే సూర్య, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటి అంజల్‌, రామ్‌ చరణ్‌ భార్యగా కనిపించనుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?