థియేటర్లకు షాక్‌.. మరో నాలుగు నెలలు క్లోజ్‌!

By Satish ReddyFirst Published May 16, 2020, 12:16 PM IST
Highlights

గతంలో జరిగిన సమీక్షలో తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ జూన్ లో షూటింగ్ లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆశలు చిగురించాయి. కానీ తాజాగా ఆ ఆశలపై నీళ్లు జల్లారు మంత్రి.

కరోనా ప్రభావం అన్ని రంగాల మీద తీవ్ర స్థాయిలో ఉంది. అయితే అత్యవర రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తున్నా.. వినోధరంగం లాంటి వాటికి మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వటం లేదు. ఇప్పటికే షూటింగ్‌లు బంద్‌ అయి దాదాపు 2 నెలల అవుతోంది. చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిన థియేటర్లు తెరవక పోవటంతో ఏం చేయాలో పాలుపోక మిన్నకుండిపోయారు. మరికొందరు నిర్మాతలు ధైర్యం చేసి సినిమాలను డైరెక్ట్‌గా డిజిటల్‌లో రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం థియేటర్‌ యాజమాన్యాలకు మరో షాక్‌ ఇచ్చింది.

గతంలో జరిగిన సమీక్షలో తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ జూన్ లో షూటింగ్ లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆశలు చిగురించాయి. కానీ తాజాగా ఆ ఆశలపై నీళ్లు జల్లారు మంత్రి. ప్రస్తుతం కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గని నేపథ్యంలో `ఇప్పుడు థియేటర్లు తెరిస్తే సమస్య తీవ్రమవుతుంది. ప్రజలు కూడా థియేటర్లకు వచ్చే ఆలోచన చేస్తారని నేను అనుకోవటం లేదు. భౌతిక దూరం ఉండేలా థియేటర్ల సీటింగ్ మార్చాల్సి ఉంది.

ఈ నిబంధనకు మల్టిప్లెక్స్‌ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నా.. సింగిల్‌ స్క్రీన్స్‌తో పాటు పట్టణాలు, గ్రామాల్లోని థియేటర్లు ఆర్ధిక భారాన్ని మోయలేవు. ఎగ్జిబిటర్‌లు కూడా ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. అందుకే కనీసం మరో మూడు, నాలుగు నెలల పాటు థియేటర్లు తెరిచే ఉద్దేశం మాకు లేదు` అని మంత్రి తలసాని వెల్లడించారు. షూటింగ్‌ ల విషయంలో కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. మరి ఈ పరిణామాలపై నిర్మాతలు, సినీ పెద్దలు, థియేటర్ల యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

click me!