
ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు కూడా సామాన్యుల్లా మారిపోయారు. ఇళ్ళలోకి పని మనుషులు వచ్చే పరిస్థితి లేకపోవటంతో ఎవరీ పనులు వారు చేసుకోక తప్పని పరిస్థితి. దీంతో సినీ తారలు కూడా స్వయంగా పండుకొని తింటున్నారు. ఇంటి పనితో బిజీగా కాలం గడిపేస్తున్నారు. అంతేకాదు స్వయంగా దుకాణాలకు వెళ్లి సరుకులు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ నడుచుకుంటూ ఓ మెడికల్ షాప్‌కు వెళ్లిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంతలు బైక్ మీద రైడ్ కు వెళ్లిన ఫోటో ఒకటి సమంత షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. అంతకు ముందు కార్ లో బయటకు వెళ్తూ ఓ సాహస యాత్రకు వెళుతున్నాం అంటూ కామెంట్ చేసింది సమంత. అయితే ఇంట్లోకి కావాల్సిన సరుకుల కోసం చై, సామ్‌లు తరుచూ బయటకు వస్తున్నారిని భావిస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఇంట్లో పనివాళ్లు ఎవరు లేకపోవటంతో తామే స్వయంగా వెళ్లి అన్ని తెచ్చుకుంటున్నారు. సమంత పుట్టిన రోజు సందర్భంగా కూడా నాగ చైతన్య స్వయంగా కేక్ ప్రిపేర్ చేశాడు.
అయితే తాజాగా బైక్ మీద దిగిన ఫోటోపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధించాయి. అందులో భాగంగా ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలన్న నిబంధన ఉంది. అంతేకాదు టూ వీలర్ మీద ఒక్కరి మించి అనుమతి లేదు. దీంతో చైతూ, సమంతలు ఆ నింబంధనలను ఉల్లంఘించారన్న టాక్ వినిపిస్తోంది. ఫోటోలో సమంత, చైతూలు ఒకే బైక్ మీద ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. సమంత మాస్క్ కూడా ధరించి లేదు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారే ఇలా తప్పులు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు.