Beast Movie Songs : దూసుకెళ్తున్న తలపతి విజయ్ ‘బీస్ట్’ సెకండ్ సింగిల్.. ఈసారైనా థమన్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా?

Published : Mar 20, 2022, 12:16 PM ISTUpdated : Mar 20, 2022, 12:18 PM IST
Beast Movie Songs : దూసుకెళ్తున్న తలపతి విజయ్ ‘బీస్ట్’ సెకండ్ సింగిల్.. ఈసారైనా థమన్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా?

సారాంశం

‘బీస్ట్’ నుంచి అరబిక్ కుత్తు, ‘సర్కారు వారి పాట’ నుంచి కళావతి రిలీజై  తెగ పోటీపడ్డాయి. కానీ అరబిక్ కుత్తు రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే బీస్ట్ నుంచి ‘జాలీ ఓ జింఖానా’ రిలీజై దూసుకుపోతోంది. ఈ రోజు రిలీజ్ కానున్న ‘పెన్సీ’ ఈ సాంగ్ ను బీట్ చేస్తుందా? అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

గత నెల వాలెంటైన్స్ డే సందర్భంగా తళపతి విజయ్ (Vijay Thalapathy) నటించిన తమిళ చిత్రం ‘బీస్ట్’ (Beast) నుంచి ఫస్ట్ సింగిల్ అరబిక్ కుత్తు  రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ట్రెండీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటు టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన ‘సర్కారు వారి పాట’ Sarkaru Vaari Paata నుంచి  కూడా వాలెంటైన్స్ డేకు ఒక్క రోజు ముందే ‘కళావతి’ (Kalaavathi) ఫస్ట్ సింగిల్  రిలీజైంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. 

వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రెండు లవ్ సాంగ్స్ రిలీజ్ అయ్యి యూట్యూబ్, సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశాయి. రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఈ రెండు సాంగ్స్ 20 మిలియన్ల పైనే వ్యూస్ ను దక్కించుకున్నాయి. కానీ అనిరుధ్ మ్యూజిక్ అందించిన Arabic Kuthuకి మాత్రం క్రేజీ ఎక్కువ ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. కాగా కళావతి ఇంకా 100 మిలియన్లను రీచ్ అయ్యే పనిలోనే ఉంది. అయితే కళావతి సాంగ్ రిలీజ్ కు ముందే లీక్ అవడంతో కొంత ఆ ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా రిలీజ్ అయిన రెండు రోజుల వరకు అరబిక్ కుత్తు, కళావతి మధ్య గట్టి పోటీ నడిచింది. సోషల్ మీడియా వ్యూస్ కౌంట్ కాంపిటీషన్ నిర్వహించారు.

ఇక ఈ రెండు చిత్రాల సెకండ్ సింగిల్ విషయంలోనూ అదే రిపీట్ కానుంది. అనిరుధ్ Anirudh, థమన్ Thaman కు పోటీ అన్నట్టుగా రిలీజ్ డేట్స్ కూడా ఒక్కరోజు గ్యాపే ఉంది. ఇప్పటికే నిన్న బీస్ట్ నుంచి సెకండ్ సింగిల్ ‘జాలీ ఓ జింఖానా’ (Jolly o Gymkhana) లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన 10 గంటల్లోనే ఈ సాంగ్ 10 మిలియన్ల వ్యూస్, 10 మిలియన్ల లైక్స్ ను  దక్కించుకుంది. ప్రస్తుతం 12 మిలియన్ల వ్యూస్ ను రీచ్ అవుతోంది. అయితే అరబిక్ కుతుకంటే.. జాలీ ఓ జింఖానా సాంగ్ కొంత మ్యూజిక్ పరంగా హైప్ ఇవ్వడం లేదు. ఇక ఇటు సర్కారు వారి పాట నుంచి నిన్న రిలీజ్ చేసిన ‘పెన్నీ’ ప్రోమో ప్రస్తుతం దూసుకుపోతోంది. 

ఈ క్రమంలో ఈ సారైనా థమన్ మ్యూజిక్ సెన్సేషన్ ‘పెన్నీ’తో ప్రూవ్ కానుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు రిలీజ్ కానున్న Penny సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా  బీస్ట్ మూవీ సాంగ్స్ రికార్డును, సర్కారు వారి పాట పెన్సీ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. పెన్నీ ప్రోమో ఇప్పటికే నాలుగు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ