
ఓ వైపు `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి(Chiranjeevi)పై రాజమౌళి (Rajamouli) ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్‌కి ఆయనే పెద్ద అని తేల్చి చెప్పారు. కానీ చిరంజీవి బ్యాట్‌మ్యాన్(Batman)గా మారిపోయారు. సోషల్ మీడియాలో చిరంజీవి బ్యాట్‌మ్యాన్‌గా ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు మీమ్స్ రాయుళ్లు చిరంజీవిపై సెటైర్లు వేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు చిరంజీవి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నారు. ఇంతకి మ్యాటర్ ఏంటంటే?
హాలీవుడ్‌లో సూపర్ హీరోస్ చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తుంది. ఈ చిత్రాలను ఓ సిరీస్‌గా వస్తుంటాయి. అందులో ఒకటి `బ్యాట్‌మ్యాన్`. ఈ సినిమా ఈ నెల మొదటి వారంలో విడుదలైంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ ఆడియెన్స్ సెర్చ్ చేస్తున్నారు. సినిమా కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేయగా, కొన్ని బ్యాట్‌మ్యాన్ లుక్‌తో ఉన్న వీడియోలు వచ్చాయి. వాటిలో ఒకటి డౌన్‌లోడ్ చేయగా, అందులో చిరంజీవి కనిపించడం ఆ హాలీవుడ్ ఆడియెన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
దీంతో `తాము రాంగ్ బ్యాట్‌మ్యాన్‌ని డౌన్‌లోడ్ చేశామంటూ` కామెంట్లు చేస్తున్నారు. మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇంతకి ఆ వీడియోలో ఏముందంటే చిరంజీవి నటించిన `ముఠామేస్త్రీ` చిత్రంలోని ఓ పాట క్లిప్ ఉండటం విశేషం. చిరంజీవి నటించిన `ముఠామేస్త్రీ`లోని `వాన గడియారంలో` పాటలో చిరంజీవి బ్యాట్‌మ్యాన్ గెటప్‌లో కనిపించారు. అద్భుతమైన డాన్సులతో అదరగొట్టారు. నెటిజన్లు దాన్ని సెర్చ్ చేయగా, ముఠామేస్త్రీ చిత్రంలోని ఈ పాట క్లిప్ రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
అయితే దీనిపై వారు స్పందిస్తూ `తాము రాంగ్ `బ్యాట్‌మ్యాన్` మూవీని డౌన్‌లోడ్ చేశామని ఫన్నీ కామెంట్లు చేయడం విశేషం. మాకు `బ్యాట్‌మ్యాన్` సినిమా కావాలి. కానీ అందుకు అర్హతలేదేమో అనడం విశేషం. అయితే చిరంజీవిని బాలీవుడ్ నటుడిగా పిలవగా, దాన్ని గుర్తించిన తెలుగు ఆడియెన్స్ ఆయన టాలీవుడ్ మెగాస్టార్ అని, ఆయన ఇప్పటికీ నటిస్తున్నారని, ప్రస్తుతం `ఆచార్య` సినిమా చేస్తున్నారని రిప్లై ఇవ్వడం మరో విశేషం. అంతేకాదు `ఆచార్య` టీజర్‌ని వారికి షేర్ చేస్తున్నారు. మొత్తంగా చిరంజీవి బ్యాట్‌మ్యాన్‌గా మారిపోయిన హాలీవుడ్ ఆడియెన్స్ కే షాక్ ఇచ్చారు చిరు.
ఇక చిరంజీవి నటించిన `ముఠామేస్త్రీ` చిత్రం 1993లో విడుదలైంది. ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో మీనా, రోజా కథానాయికలుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటించగా, ఇది వచ్చే నెలలో విడుదల కాబోతుంది. దీంతోపాటు `గాడ్‌ఫాదర్`, `భోళాశంకర్` అలాగే బాబీతో సినిమా చేస్తున్నారు.