అల్లు అర్జున్ తో మల్టీస్టారర్.. బాలీవుడ్ స్టార్ హీరో కోరికట!

Published : Nov 16, 2018, 05:39 PM IST
అల్లు అర్జున్ తో మల్టీస్టారర్.. బాలీవుడ్ స్టార్ హీరో కోరికట!

సారాంశం

ఈ మధ్య కాలంలో భాషలతో సంబంధం లేకుండా అందరి హీరోలను ప్రేక్షకులు అభిమానిస్తున్నారు. సినిమా బావుందంటే చాలు హీరో గురించి మాట్లాడుకోవడం అలవాటుగా చేసుకుంటున్నారు ఇక టాలెంట్ ఉంటె స్లేబ్రేటీలు కూడా ఇతర హీరోలను అభిమానించడానికి ఇష్టపడుతున్నారు. 

ఈ మధ్య కాలంలో భాషలతో సంబంధం లేకుండా అందరి హీరోలను ప్రేక్షకులు అభిమానిస్తున్నారు. సినిమా బావుందంటే చాలు హీరో గురించి మాట్లాడుకోవడం అలవాటుగా చేసుకుంటున్నారు ఇక టాలెంట్ ఉంటె స్లేబ్రేటీలు కూడా ఇతర హీరోలను అభిమానించడానికి ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ హీరో తనకు ఇష్టమైన సౌత్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పేశాడు. రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చిన టైగర్ మీడియాతో మాట్లాడాడు. తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టమని, అతని సినిమాలను ఫాలో అవుతుంటాను అని చెప్పారు. అదే విధంగా మల్టీస్టారర్ లో నటించే అవకాశం వస్తే మొదటగా అల్లు అర్జున్ తో చేయాలనదే తన కోరిక అని కూడా తెలిపాడు. 

ఇక మా నాన్నగారు జాకీ ష్రాఫ్ పలు తెలుగు సినిమాల్లో నటించారని మంచి అవకాశం వస్తే తెలుగులో నేను కూడా నటిస్తాను అని టైగర్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. ఈ యువ హీరో చివరగా భాగీ 2 - మున్నా మైకేల్ సినిమాలతో వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకున్నాడు. త్వరలోనే ఒక భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?