చిరు,కేసీఆర్ లను ప్రస్తావిస్తూ నిర్మాత ఠాగూర్ మధు ట్వీట్

Published : Mar 26, 2019, 09:42 AM IST
చిరు,కేసీఆర్ లను ప్రస్తావిస్తూ నిర్మాత ఠాగూర్ మధు ట్వీట్

సారాంశం

తన కెరీర్ లో ఠాగూర్, గజనీ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఠాగూర్ మధు అంటే అందరికి తెలిసిందే. రీసెంట్ గా మహేష్ తో స్పైడర్ తీసిన ఆయన చిరంజీవికు బాగా సన్నిహితుడు. 

తన కెరీర్ లో ఠాగూర్, గజనీ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఠాగూర్ మధు అంటే అందరికి తెలిసిందే. రీసెంట్ గా మహేష్ తో స్పైడర్ తీసిన ఆయన చిరంజీవికు బాగా సన్నిహితుడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ..కేసీఆర్ పై  వ్యాఖ్యలు చేయటంతో చాలా మంది పవన్ ని విమర్శిస్తూ అందులో భాగంగా చిరంజీవిని, ప్రజారాజ్యం పార్టీని లాగుతున్నారు. 

మరికొందరు పవన్ అభిమానులు... కేసీఆర్ ని సైతం ఈ డిస్కషన్స్ లోకి తీసుకొస్తున్నారు.  ఇవన్నీ ఆయన గమనిస్తున్నట్లున్నారు. తన సినిమాలేంటో చేసుకుంటూ పోతున్న చిరంజీవిని ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేయటం ఆయనకు నచ్చలేట్లుంది.  దాంతో ఆయన ఆ బాధను వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేసారు.

ఆ ట్వీట్ లో ..“మీరు ఏ పొలిటికల్ ట్రిక్స్ అయినా చేసుకోండి. కానీ ఎందుకు జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన చిరంజీవి గారు పేరు, కేసీఆర్ ని ఎందుకు మీ రాజకీయాల్లోకి లాగుతున్నారు. వాళ్లు సైలెంట్ గా ఉన్నారు కదా .” అంటూ మండిపడ్డారు.  మరి ఈ ట్వీట్ తో అయినా చిరుని, కేసీఆర్ ని డిస్కషన్స్ లోకి లాగటం ఆపుచేస్తారా...చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్