40+లో ఉంటే ఏంటి?.. దేనికైనా రెడీ: టబు ఛాలెంజ్

By Prashanth MFirst Published May 14, 2019, 8:57 PM IST
Highlights

సీనియర్ నటి టబు పుట్టింది హైదరాబాద్ లోనే అయినా ఎక్కువగా కెరీర్ కొనసాగించింది మాత్రం ముంబైలోనే. తెలుగు జనాలకు ఒకటి రెండు సినిమాలతోనే బాగా దగ్గరైపోయింది. నార్త్ డోర్స్ ఓపెన్ అవ్వగానే బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసిన అమ్మడు సౌత్ సినిమాలు నచ్చితేనే చేస్తోంది. 

అసలు విషయంలోకి వస్తే.. అమ్మడికి నాలుగు పదుల వయసు ధాటి 50లోకి వచ్చేస్తోంది. అయినా కూడా అమ్మడు గ్లామర్ డోస్ తగ్గించడం లేదు. ఎలాంటి పాత్రలొచ్చినా కూడా చేసేస్తాను అంటోంది. హోమ్లీ క్యారెక్టర్ అయినా హాట్ హీరోయిన్ గా అయినా మెరవడానికి తాను సిద్దమే అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ గా చెప్పేసింది. 

ప్రస్తుతం బాలీవుడ్ లో అమ్మడు నటించిన దే దే ప్యార్ దే రిలీజ్ కు రెడీ అవుతోంది. అందులో అజయ్ దేవగన్ భార్యగా నటించింది. ఇక తెలుగులో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో తల్లి పాత్రలో కనిపించనుందట. అయితే ఆమె సినిమాలో ఎవరికి(హీరో - హీరోయిన్) తల్లిగా నటిస్తోంది అనేది తెలియాల్సి ఉంది.  

click me!