నయనతార ‘నో’ చెప్పిన తెలుగు హీరో ఎవరు?

Surya Prakash   | Asianet News
Published : Nov 19, 2020, 02:44 PM IST
నయనతార ‘నో’ చెప్పిన తెలుగు హీరో ఎవరు?

సారాంశం

 ‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శ్రీను’, ‘తులసీ’ తదితర సినిమాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఓ హోదాను ఇవ్వలేపోయాయి. దాంతో ఆమె తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఆ తర్వాత  ‘అదుర్స్‌’, ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘అనామిక’తోపాటు పలు తమిళ సినిమాలతో హిట్లు అందుకున్నారు.

నయనతార కెరీర్ ప్రారంభంలో వచ్చిన ‘చంద్రముఖి’, ‘గజినీ’ సినిమాలు ఆమెకు తెలుగులోనూ ఎంతో పేరు తీసుకువచ్చాయి. ఆ తర్వాత ఆ క్రేజ్ ని ఆసరా చేసుకుని 2006లో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు. విక్టరీ వెంకటేష్‌ సరసన ‘లక్ష్మీ’ సినిమాలో సందడి చేశారు. ఆ తర్వాత ‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శ్రీను’, ‘తులసీ’ తదితర సినిమాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఓ హోదాను ఇవ్వలేపోయాయి. దాంతో ఆమె తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఆ తర్వాత  ‘అదుర్స్‌’, ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘అనామిక’తోపాటు పలు తమిళ సినిమాలతో హిట్లు అందుకున్నారు.

‘శ్రీరామ రాజ్యం’ కోసం సీతగా మారి నంది అవార్డు కూడా అందుకున్నారు.  నయన్‌ ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’, ‘దర్బార్‌’ తదితర చిత్రాల్లో కనిపించారు. ఈ నేపధ్యంలో ఆమెను తెలుగు సీనియర్ హీరోల సరసన నటించమంటూ దర్శక,నిర్మాతలు అడుగూనే ఉన్నారు. రీసెంట్ గా కూడా ఓ సీనియర్ హీరో కోసం ఆమెను అడిగినట్లు సమాచారం. అయితే ఆమె ఎంత రెమ్యునేషన్ ఇచ్చినా కూడా చేయటం కష్టమని తెగేసి చెప్పిందిట. అందుకు ఆమె డేట్స్ ఖాళీ లేవనే కారణం మాత్రమే చెప్పిందిట. అంతకు ముందు కూడా ఆ హీరోతో ఆమె సినిమా చేసిందిట. ఈ నేపధ్యంలో ఎవరా సీనియర్ హీరో అనేది ఇపడు అంతటా చర్చనీయాశంగా మారింది. 

ప్రస్తుతం ‘నెట్రికన్‌’, ‘కాతువాకుల రెండు కాదల్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె సీనియర్ ప్రక్కన వద్దనటానికి కారణం తన పాత్రకు సరైన సీన్స్ , ప్రాధాన్యత లేకపోవటమే అంటున్నారు. అంతేకాదు తన రెమ్యునేషన్ తగ్గించుకోమని అడగుతున్నారట. అమ్మోరు తల్లి వంటి చిన్న సినిమాలు చేసినా ఆమెకు గిట్టుబాటు అవుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించటమే ఆమె పెద్ద సినిమాలు వద్దనుకోవటానికి కారణం అంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Balakrishna New House: ఇరుగు పొరుగు వారిగా మారబోతున్న చిరు, బాలయ్య, బన్నీ..బాలకృష్ణకి ఇది మూడో లగ్జరీ హౌస్
Karthika Deepam 2 Today Episode: జ్యోకు హ్యాండ్ ఇచ్చిన వైరా-కార్తీక్‍ని గన్‍తో షూట్-డబ్బుతో ఎస్కేప్