'RX100' రీమేక్.. ఆ హీరోతో ముద్దులాటకు తాప్సి సై!

Published : Aug 14, 2018, 03:55 PM ISTUpdated : Sep 09, 2018, 12:50 PM IST
'RX100' రీమేక్.. ఆ హీరోతో ముద్దులాటకు తాప్సి సై!

సారాంశం

తమిళ టాప్ ప్రొడక్షన్ కంపెనీ ఔరా సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా నటించడానికి ఆది పినిశెట్టి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆదికి జంటగా సినిమాలో హీరోయిన్ గా తాప్సి నటించబోతుందని సమాచారం. ఇటీవల RX100 సినిమా చూసిన తాప్సి హీరోయిన్ పాత్రలో నటించడానికి అంగీకరించిందని అంటున్నారు

'RX100' సినిమా టాలీవుడ్ లో అంచనాలకు మించి ఆడి నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చింది. నిజానికి ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం.. సినిమాలో హీరోయిన్ బోల్డ్ పెర్ఫార్మన్స్, 45 కి పైగా లిప్ లాక్స్, క్లైమాక్స్ అనే చెప్పాలి. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటన సినిమా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఆమె కనబరిచిన బోల్డ్ పెర్ఫార్మన్స్ కి యూత్ ఫిదా అయిపోయింది.

ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. తమిళ టాప్ ప్రొడక్షన్ కంపెనీ ఔరా సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా నటించడానికి ఆది పినిశెట్టి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆదికి జంటగా సినిమాలో హీరోయిన్ గా తాప్సి నటించబోతుందని సమాచారం. ఇటీవల RX100 సినిమా చూసిన తాప్సి హీరోయిన్ పాత్రలో నటించడానికి అంగీకరించిందని అంటున్నారు.

అదే గనుక నిజమైతే.. వీరిద్దరి కెమిస్ట్రీ తెరపై ఏ రేంజ్ లో పండుతుందో చూడాలి. ప్రస్తుతానికి ఆది, తాప్సి కలిసి 'నీవెవరో' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

MSG Movie Review: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ సంక్రాంతి మొత్తం చిరంజీవిదే
Actor Ravi Mohan: డైరెక్టర్ కాకముందే విలన్‌గా రవి మోహన్.. షాకింగ్ రెమ్యూనరేషన్