త్రివిక్రమ్ కుర్చీలాటపై కామెంట్స్!

By Udayavani DhuliFirst Published 14, Aug 2018, 3:27 PM IST
Highlights

నెగెటివ్ సెంటిమెంట్ అని కూడా ఆలోచించకుండా త్రివిక్రమ్ కుర్చీలను ఈ సినిమాలో కూడా రిపీట్ చేయడంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో సినిమా చేయడంపై ఆయన అభిమానుల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది

దర్శకుడు త్రివిక్రమ్.. ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన ఎన్టీఆర్ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డార్క్ షేడ్ లో ఎన్టీఆర్ కుర్చీలో కూర్చొని ఉండగా అతడి ముందు ఓ వ్యక్తి పడి ఉన్నాడు.

బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం కుర్చీలు, బల్లలు పడి ఉన్నాయి.  ఈ పోస్టర్ చూస్తుంటే అభిమానులకు 'అజ్ఞాతవాసి'లో పవన్ లుక్ గుర్తొస్తోంది. ఆ సినిమా టీజర్ లో కూడా పవన్ కుర్చీని తిప్పుతూ చెప్పే డైలాగ్ హైలైట్ అయింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. కానీ 'అజ్ఞాతవాసి' మాత్రం ప్రేక్షకుల అంచనాలకు రీచ్ కాలేకపోయింది. నెగెటివ్ సెంటిమెంట్ అని కూడా ఆలోచించకుండా త్రివిక్రమ్ కుర్చీలను ఈ సినిమాలో కూడా రిపీట్ చేయడంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో సినిమా చేయడంపై ఆయన అభిమానుల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. కానీ ఎన్టీఆర్ మీద నమ్మకంతో అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ నెగెటివ్ సెంటిమెంట్ రిపీట్ చేయడం అభిమానులకు రుచించడం లేదు. మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
 

Last Updated 9, Sep 2018, 12:53 PM IST