రహస్యంగా ఫోటోలు తీశాడని బెదిరించా.. తాప్సీ కామెంట్స్!

By AN TeluguFirst Published Jun 24, 2019, 4:59 PM IST
Highlights

ఒక్కోసారి మన తారలు తమ పాత్రల్లో లీనమైపోవడం వలన నిజజీవితంలో కూడా అలానే ప్రవర్తిస్తూ రీల్ లైఫ్ క్యారెక్టర్ నుండి పూర్తిగా బయటపడలేకపోతారు. 

ఒక్కోసారి మన తారలు తమ పాత్రల్లో లీనమైపోవడం వలన నిజజీవితంలో కూడా అలానే ప్రవర్తిస్తూ రీల్ లైఫ్ క్యారెక్టర్ నుండి పూర్తిగా బయటపడలేకపోతారు. హీరోయిన్ తాప్సీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట.

ఈ విషయాన్ని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాప్సీ హీరోయిన్ గా 'మన్మర్జియా' అనే సినిమాలో నటించింది. గత ఏడాదిలో విడుదలైన ఈ సినిమాలో తాప్సీ చాలా గంభీరంగా నటించింది. ఎవరైనా తనకు నచ్చని పని చేస్తే కొట్టిపడేస్తుంది.

అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత తాప్సి  తన సోదరితో కలిసి బయటకి వెళ్లిందట. ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి రహస్యంగా తాప్సి ఫోటోలు తీశాడట. అది గమనించిన తాప్సి కోపంగా అతని వద్దకు వెళ్లి ఫోన్ లోపల పెడతావా..? లేక పగలగొట్టనా..? అని బెదిరించిందట.

దీంతో ఆ ఫోటోలు తీసిన వ్యక్తి అక్కడ నుండి పారిపోయాడట. తాప్సి సోదరి మాత్రం భయపడి తనకు ఏమీ తెలియనట్లుగా ఉండిపోయిందట. ఈ విషయాన్ని నవ్వుతూ చెప్పుకొచ్చింది తాప్సి. 'బద్లా' సినిమాలో నటిస్తోన్న సమయంలో తాప్సి సోదరి భయపడేవారట. ఆ సినిమాలో మాదిరి నిజజీవితంలో కూడా ఎవరినైనా చంపేస్తానేమోనని  తన సోదరి భయపడిందని తాప్సి చెప్పుకొచ్చింది.  

click me!