శాటిలైట్ రైట్స్ లో సరిలేరు నీకెవ్వరు!

Published : Jun 24, 2019, 04:43 PM IST
శాటిలైట్ రైట్స్ లో సరిలేరు నీకెవ్వరు!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి ఋజువయ్యింది. ఇంకా షూటింగ్ మొదలవ్వకముందే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ నిర్మాతలకు మంచి లాభాల్ని అందించేస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి ఋజువయ్యింది. ఇంకా షూటింగ్ మొదలవ్వకముందే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ నిర్మాతలకు మంచి లాభాల్ని అందించేస్తున్నాడు. గత కొంత కాలంగా డిజిటల్ - శాటిలైట్ పరంగా మహేష్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా శాటిలైట్ హక్కల్ని జెమిని టీవీ సాలిడ్ రేట్ కు దక్కించుకున్నట్లు అధికార ప్రకటన వెలువడింది. మహర్షి సినిమా 16.8కోట్లకు అమ్ముడుపోగా ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో సరిలేరు నీకెవ్వరు సినిమాను జెమిని టివి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

జులై 5న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను దిల్ రాజు - అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ముఖ్య పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్