రెండేళ్ల తర్వాత తెలుగులో తాప్సీ.. ఆమె లీడ్‌ రోల్‌తో `మిషన్‌ ఇంపాజిబుల్‌`

Published : Jul 06, 2021, 03:26 PM IST
రెండేళ్ల తర్వాత తెలుగులో తాప్సీ.. ఆమె లీడ్‌ రోల్‌తో `మిషన్‌ ఇంపాజిబుల్‌`

సారాంశం

చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో ఓ సినిమాకి సైన్‌ చేసింది తాప్సీ. `ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ` వంటి సూపర్‌ హిట్‌ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. 

చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో ఓ సినిమాకి సైన్‌ చేసింది తాప్సీ. `ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ` వంటి సూపర్‌ హిట్‌ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో రూపొందుతున్న `మిషన్‌ ఇంపాజిబుల్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె ఇందులో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది.  నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

`ఈ చిత్రానికి `మిషన్ ఇంపాజిబుల్` అనే టైటిల్ తోపాటు ఇటీవ‌ల విడుద‌ల‌ చేసిన థీమ్ పోస్ట‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. `గేమ్‌ ఓవర్‌` సినిమాలో చివ‌ర‌గా తెలుగు తెరపై కనిపించింది తాప్సీ. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప‌లు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తెలుగులో `మిషన్ ఇంపాజిబుల్` సినిమాలో లీడ్‌రోల్‌లో నటిస్తుండటం విశేషం. ఈ రోజు నుండి `మిషన్ ఇంపాజిబుల్` షూటింగ్‌లో జాయిన్ అయ్యారు తాప్సీ. అలాగే చేతికి క‌ట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియ‌స్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశాం. ఇది ఆకట్టుకుంటుంది` అని యూనిట్‌ తెలిపింది. 

 తాప్సీ ప‌న్ను మాట్లాడుతూ, `గత 7 సంవత్సరాలుగా ఒక‌ ప్రేక్షకుడిగా నన్ను నేను చూడాలనుకునే కథలలో భాగం కావాలని వెతుకుతున్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. `మిషన్ ఇంపాజిబుల్` అలాంటి చిత్రాల్లో ఒక‌టి. ఆకట్టుకునే కథాంశం, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లాంటి మంచి టీమ్ కావ‌డంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నా. క్వాలిటీ  చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని ఇలాంటి సినిమాల‌లో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిల‌బెట్టుకోగ‌ల‌నని న‌మ్ముతున్నా` అని అన్నారు.  ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌, మార్క్ కె రాబిన్ సంగీత ద‌ర్శ‌కుడు, ర‌వితేజ గిరిజ‌ల ఎడిట‌ర్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

శోభన్ బాబు ను సెట్ లో చూసి, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు అని.. ఇంప్రెస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today: టాలెంట్ ప్రూవ్ చేసుకున్న మీనా, పోటీకి పోయి కాళ్లు విరగ్గొట్టుకున్న ప్రభావతి