`పుష్ప` విషయంలో తగ్గేదెలే అంటోన్న ఐకాన్‌ స్టార్‌.. షూటింగ్‌ పునఃప్రారంభం..

Published : Jul 06, 2021, 12:56 PM IST
`పుష్ప`  విషయంలో తగ్గేదెలే అంటోన్న ఐకాన్‌ స్టార్‌.. షూటింగ్‌ పునఃప్రారంభం..

సారాంశం

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న `పుష్ప` షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది.  సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేసినట్టు చిత్రబృందం తెలిపింది.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా `పుష్ప`. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. రష్మిక మందన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎర్ర చంద్రనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే దొంగగా కనిపిస్తాడని సమాచారం. 

ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్‌ పాత్ర పరిచయ టీజర్‌లోనూ ఇలాంటి సన్నివేశాలనే చూపించారు. ఈ టీజర్‌ 70 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని రాబట్టుకుని సంచలనం సృష్టిస్తుంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ ఆగిపోయిన విషయం తెలిసిందే. తిరిగి చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. మంగళవారం నుంచి `పుష్ప` షూటింగ్‌ పునః ప్రారంభమైందని చిత్ర బృందం వెల్లడించింది. 

`ఆర్య`, `ఆర్య2` చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. ఆగస్టు 13న విడుదల చేయాలని గతంలో చిత్రబృందం ప్రకటించింది. కరోనాసెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళం,కన్నడ,మలయాళంలో విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?