
సొట్ట బుగ్గల సుందరి తాప్సి కెరీర్ ప్రారంభం అయింది టాలీవుడ్ తోనే. కానీ ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.
అయితే తాప్సి బాలీవుడ్ కంటే ముందే సౌత్ చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. కాయాన్ని అవకాశం ఇచ్చిన సౌత్ పై తరచుగా తాప్సి అక్కసు వెళ్లగక్కడం చూస్తూనే ఉన్నాం. గతంలో తాప్సి పలుమార్లు సౌత్ సినీ ఇండస్ట్రీపై హాట్ కామెంట్స్ చేసింది. అక్కడ మహిళా ఆర్టిస్టులకు గౌరవం ఉండదని.. మొత్తం హీరో సెంట్రిక్ అంటూ రాఘవేంద్ర రావుపై కూడా విమర్శలు చేసింది.
కానీ తాప్సి పదే పదే సౌత్ చిత్ర పరిశ్రమని కించపరుస్తూ మాట్లాడడం అందరి ఆగ్రహానికి కారణం అవుతోంది. తాప్సి బాలీవుడ్ లో కి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం చష్మే బద్దూర్ ఇటీవల పదేళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా తాప్సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాప్సి సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో నాకు దక్కిన గుర్తింపు చేస్తున్న చిత్రాల పట్ల చాలా సంతోషంగా ఉన్నాయి. బాలీవుడ్ చిత్రాలు నటిగా నన్ను మరోస్థాయికి చేర్చాయి. అంతకు ముందు నేను సౌత్ లో నటించినప్పటికీ ఆ చిత్రాల వల్ల తనకు ఎలాంటి సంతృప్తి లేదని తాప్సి హాట్ కామెంట్స్ చేసింది.
దీనితో నెటిజన్లు తాప్సి పై మండిపడుతున్నారు. సౌత్ లో తాప్సికి ఎక్కువగా గ్లామర్ రోల్స్ వచ్చాయి. అది కూడా స్టార్ హీరోల చిత్రాల్లో, కానీ బాలీవుడ్ లో ఆమెని మించిన స్టార్ బ్యూటీలు చాలా మందే ఉన్నారు. కాబట్టి ఆమెకి అక్కడ గ్లామర్ రోల్స్ దక్కలేదు. దీనితో ఆమెకి కంటెంట్ ఓరియెంటెడ్ కథలు ఎంచుకోక తప్పలేదు. ఆ చిత్రాల్లో కొన్ని విజయం సాధించడంతో గుర్తింపు లభించింది. అంత మాత్రానికే నటిగా అవకాశం ఇచ్చిన సౌత్ ని కించపరుస్తూ మాట్లాడడం తగదు అని సూచిస్తున్నారు.