ప్రభాస్ ఫ్యాన్స్ బైక్ ర్యాలీ.. ‘ఆదిపురుష్’ కోసం తరలివచ్చిన అభిమానులు.. వైజాగ్ లో సేవా కార్యక్రమాలు

By Asianet News  |  First Published Apr 17, 2023, 5:14 PM IST

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ కోసం హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. పలు చోట్లా సేవా కార్యక్రమాలతో చిత్రాన్ని విజయవంతం చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన మైథాలజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ (Adipurush) కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సరిగ్గా రెండు నెలల  సమయం ఉంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్ కూకట్ పల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభాస్ చిత్రంతో కూడిన జెండాలను పట్టుకొని.. బైక్ పై నగరంలో ర్యాలీ తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

మరోవైపు వైజాగ్ లోని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరుపున సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ‘ఆదిపురుష్’ రిలీజ్ కు రెండు నెలల సమయం ఉండటంతో ఫ్యాన్స్ అంతా కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సత్యానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మొత్తానికి చిత్రాన్ని విజయవంతం చేసేందుకు, సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకు  ప్రభాస్ ఫ్యాన్స్ తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.  

Latest Videos

‘ఆదిపురుష్’ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. గతంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ నాశిరకంగా ఉండటం, పలువురు చిత్రంలోని పాత్రలపై విమర్శలు చేయడంతో బెస్ట్ అవుట్ పుట్ అందించేందుకు కాస్తా సమయం తీసుకున్నారు. ఇక ఎట్టకేళలకు జూన్ 16న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించింది. 

ప్రభాస్ - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Krithi Sanon) జంటగా నటిస్తున్నారు.  ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ-సిరీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ భారీగా నిర్మించారు. రీసెంట్ గా శ్రీరామ నవమి సందర్భంగా సీతారాములు, లక్ష్మణ్, హనుమాన్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా దేవదత్తా నాగే నటించిన శ్రీ బజరంగ్ బలి పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. చిత్రంలో రావణసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. 

click me!