రేటు పెంచిన తాప్సి.. తగ్గేదిలేదట?

Published : Aug 06, 2019, 04:47 PM IST
రేటు పెంచిన తాప్సి.. తగ్గేదిలేదట?

సారాంశం

తాప్సి లక్కేమిటో గాని ఏ సినిమా చేసిన ఈజీగా హిట్టవుతున్నాయి. మొన్నటివరకు టాలీవుడ్ లో ఉన్న తాప్సికి పెద్దగా సక్సెస్ లు దక్కలేదు. కాకపోతే నటనలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ లో అలా కనిపించిందో లేదో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.   

సొట్ట బుగ్గల సుందరి తాప్సి లక్కేమిటో గాని ఏ సినిమా చేసిన ఈజీగా హిట్టవుతున్నాయి. మొన్నటివరకు టాలీవుడ్ లో ఉన్న తాప్సికి పెద్దగా సక్సెస్ లు దక్కలేదు. కాకపోతే నటనలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ లో అలా కనిపించిందో లేదో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. 

జూడ్వా సినిమా నుంచి తాప్సి జాగ్రత్తగా అడుగులు వేస్తూ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇకపోతే అమ్మడు ఇప్పుడు సడన్ గా రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. పింక్ సినిమా హిట్టయినప్పటి నుంచి రేటు పెంచాలని ఆలోచిస్తున్న బేబీ రీసెంట్ గా 3.5కోట్ల వరకు రెమ్యునరేషన్ ని పెంచినట్లు టాక్. 

ఇక ఈ నెల 15 రిలీజ్ కానున్న మిషిన్ మంగళ్ సినిమాలో తాప్సి కీలక పాత్రలో కనిపించనుంది. ఆ సినిమా హిట్టయితే గనక ఆమె ధర 4కోట్లను కూడా దాటే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. అవకాశాలు వచ్చినప్పుడే స్ట్రాంగ్ గా సెట్ చేసుకోవాలని చూస్తున్న ఈ  భామ కొన్ని బిజినెస్ లు స్టార్ట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.   

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?